Bank Holidays in April | ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు బందే..! పూర్తి వివరాలు ఇవే..!
Bank Holidays in April | ఏప్రిల్‌లో 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ప్రతి నెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిసిందే. ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో, సెలవులుంటాయో తెలుసుకోవడం మంచిది.
Bank Holidays in April | ఏప్రిల్‌లో 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ప్రతి నెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిసిందే. ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో, సెలవులుంటాయో తెలుసుకోవడం మంచిది. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు కలుపుకొని 15 రోజులు సెలవులు ఉండనున్నాయి. అయితే, బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్నెట్ బ్యాంక్, యూపీఐ సర్వీసులు నిరంతరాయంగా పని చేయనున్నాయి. దాంతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు వీలుంటుంది. నగదు విత్‌డ్రా కోసం ఏటీఎంలు అందుబాటులో ఉండనున్నాయి. పలు బ్యాంకులు క్యాష్ డిపాజిట్ కోసం మెషిన్స్ సైతం అందుబాటులో ఉండగా.. వీటితో అకౌంట్లో డబ్బులు చేసుకునే అవకాశం ఉంది. కొన్ని సేవల కోసం బ్యాంకులకు వెళ్లే అవసరం ఉంటుంది. అలాంటి సమాచారం సెలవుల గురించి సమాచారం ఉంటే.. ముందస్తుగానే పనులు చేసుకునే వీలుంటుంది.
ఏప్రిల్‌లో బ్యాంకుల సెలవుల వివరాలు..
ఏప్రిల్ 1న బ్యాంకుల్లో వార్షిక ఖాతాల సర్దుబాటు కారణంగా సెలవు.
ఏప్రిల్ 5న తెలంగాణలో బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు సందర్భంగా హాలీడే.
ఏప్రిల్ 6న ఆదివారం బ్యాంకులు బంద్.
ఏప్రిల్ 8న రెండో శనివారం సందర్భంగా హాలీడే.
ఏప్రిల్ 10న మహావీర్ జయంతి సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్‌తో పాటు పలు రాష్ట్రాల్లో సెలవులు.
ఏప్రిల్ 13న ఆదివారం సందర్భంగా బ్యాంకుల మూసివేత.
ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, బిహు, తమిళ సంవత్సరం సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూత.
ఏప్రిల్ 15న బెంగాలీ న్యూ ఇయర్ సందర్భంగా అసోం, వెస్ట్ బెంగాల్ సహా పలు బ్యాంకులకు హాలీడే.
ఏప్రిల్ 18న గుడ్‌ఫ్రై డే సందర్భంగా పలు ప్రాంతాల్లో బ్యాంకుల మూసివేత.
ఏప్రిల్ 20న ఆదివారం సందర్భంగా బ్యాంకులు బంద్.
ఏప్రిల్ 21న గరియా పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 26న శనివారం సందర్భంగా సెలవు.
ఏప్రిల్ 27న ఆదివారం సందర్భంగా సెలవు.
ఏప్రిల్ 29న భగవాన్ పరశురామ్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకుల మూసివేత.
ఏప్రిల్ 30న బసవ జయంతి, అక్షయ తృతీయ సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు బంద్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

