Bajaj Finance | న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 60 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు బజాజ్ ఫైనాన్స్. ప్రకటించింది. 25-35 నెలల కాలపరిమితితో సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై వడ్డీరేటును 60 బేసిస్ పాయింట్ల వరకు సవరించిన సంస్థ… అలాగే 18-24 నెలల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై రేటును 40 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీంతోపాటు సీనియేతర సిటిజన్ల డిపాజిట్లపై వడ్డీరేటును 45 బేసిస్ పాయింట్ల వరకు సవరించింది.