ముంబై, ఏప్రిల్ 25 : జనవరి మార్చిలో రూ.1,468.95 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది బజాజ్ ఆటో. నిరుడు నమోదైన రూ.1,432.88 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.8,905 కోట్లకు చేరుకున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.36,428 కోట్ల ఆదాయంపై రూ.5,627.60 కోట్ల నికర లాభాన్ని గడించింది.