ముంబై, నవంబర్ 5: ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై యాక్సిస్ బ్యాంక్ వడ్డీరేట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. 7 రోజుల నుంచి 10 ఏండ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై 3.5 శాతం నుంచి 6.5 శాతం వరకు వడ్డీ ఇస్తున్నది. సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 7.25 శాతం వరకు ఉండటం గమనార్హం. కాగా, 46 రోజుల నుంచి 10 ఏండ్ల మెచ్యూరిటీ ఎఫ్డీలపై వడ్డీరేటును 115 బేసిస్ పాయింట్లదాకా పెంచడం విశేషం. 6.1 శాతం నుంచి 7.25 శాతానికి తీసుకెళ్లింది. పెరిగిన వడ్డీరేట్లు శనివారం నుంచే అమల్లోకి వస్తాయి. రూ.2 కోట్లదాకా డిపాజిట్లపై ఇవి వర్తిస్తాయని బ్యాంక్ పేర్కొన్నది. వృద్ధుల ఎఫ్డీలపై కనిష్ఠ వడ్డీరేటు 5.5 శాతం, గరిష్ఠ వడ్డీరేటు 7.25 శాతంగా ఉన్నది.