HomeBusinessAvoid These Misconceptions About Credit Scores
క్రెడిట్ స్కోర్‌పై ఈ అపోహలు వద్దు
బ్యాంకింగ్ రంగంలో, లోన్ మార్కెట్లో క్రెడిట్ స్కోర్కున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అయితే ఈ క్రెడిట్ స్కోర్‌పై చాలామందిలో అనేక అపోహలు నెలకొన్నాయి.
బ్యాంకింగ్ రంగంలో, లోన్ మార్కెట్లో క్రెడిట్ స్కోర్కున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అయితే ఈ క్రెడిట్ స్కోర్‌పై చాలామందిలో అనేక అపోహలు నెలకొన్నాయి. అవి మీ డబ్బునేగాక, మీ రుణ పరపతినీ దెబ్బతీసే అవకాశాలున్నాయి. మరి అసలు నిజాలేంటి?..
ఇదీ నిజం: క్రెడిట్ స్కోర్‌ను తరచూ మనం చెక్ చేస్తే.. దాని ప్రభావం స్కోర్‌పై పడి తగ్గుతుందన్నది చాలామంది నమ్మకం. కానీ ఇందులో నిజం లేదు. మనంతట మనం క్రెడిట్ స్కోర్‌ను చూసుకోవడం.. సాఫ్ట్ ఎంక్వైరీ. దీనివల్ల క్రెడిట్ రేటింగ్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే రుణం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు రుణదాతలు (బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు) చేసే హార్డ్ ఎంక్వైరీతో స్వల్పంగా స్కోర్ తగ్గి తాత్కాలికంగా పడిపోగలదు.
ఇదీ నిజం: క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకున్న రుణంలో అసలును వదిలేసి వడ్డీలను చెల్లిస్తూపోతే స్కోర్ పెరుగుతుందన్నది కొందరిలో ఉన్న అపోహ. నిజానికి అలాచేస్తే మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో మాత్రమే పెరుగుతుంది. కానీ ఏ నెలకు ఆ నెల పూర్తి స్థాయిలో మీ క్రెడిట్ బిల్లులను చెల్లిస్తేనే మంచిది.
ఇదీ నిజం: మీ జీతం లేదా మీ వ్యాపార ఆదాయం.. ఎప్పుడు కూడా మీ క్రెడిట్ స్కోర్ గణనకు కారణం కాబోదు. రుణ దరఖాస్తుల పరిశీలన సమయంలోనే బ్యాంకర్లు, ఎన్బీఎఫ్సీలు మీ క్రెడిట్ స్కోర్‌ను సమీక్షిస్తారు.
ఇదీ నిజం: వాడకంలో లేని పాత క్రెడిట్ కార్డుల ఖాతాలను మూసేస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందన్నది చాలామందిలో ఉన్న అపోహ. నిజానికి అలాచేస్తే మీ రుణ చరిత్ర తగ్గి స్కోర్‌ను ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి జీరో బ్యాలెన్స్తోనైనా వాటిని అలాగే ఉంచుకోవడం ఉత్తమం. స్కోర్ సమీక్షలో మీ క్రెడిట్ హిస్టరీ పరిశీలనకు దోహదం చేస్తాయి.
ఇదీ నిజం: రుణాలు లేకపోతేనే క్రెడిట్ స్కోర్ బాగుంటుందన్నది చాలామందిలో ఉన్న నమ్మకం. అయితే రుణాలు తీసుకోకపోతే మీకు క్రెడిట్ స్కోరే ఉండదు. కాబట్టి అవసరమైనప్పుడు రుణాలు తీసుకుని, వాటిని క్రమం తప్పకుండా చెల్లిస్తేనే ఆకర్షణీయమైన క్రెడిట్ స్కోర్ ఉంటుంది. మీకు కొత్త రుణాలు ఇచ్చేటప్పుడు మీరు గతంలో తీసుకున్న రుణాలను ఎలా చెల్లించారు? లేదా చెల్లిస్తున్నారు? అన్నదే బ్యాంకర్లు చూస్తారు. రుణ చెల్లింపుల్లో ఆలస్యం, ఎగవేతలు.. స్కోర్‌ను బాగా దెబ్బతీస్తాయి.
ఇదీ నిజం: క్రెడిట్ స్కోర్ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. తగ్గుతూ.. పెరుగుతూ ఉంటుంది. అయితే ఈఎంఐ చెల్లింపులను సకాలంలో చెల్లిస్తూపోతే, రుణ భారాన్ని పరిమితంగా ఉంచుకుంటే, రుణ వినియోగ నిష్పత్తిని సరైన స్థాయిలో ఉంచుకుంటే స్కోర్ వేగంగా పెరిగేందుకు వీలుంటుంది. అలాగే అనవసరంగా ఎడాపెడా రుణాలు తీసుకున్నా.. క్రెడిట్ స్కోర్ పడిపోయే ముప్పున్నది.