Auto Sales | దేవి శరన్నవరాత్రులు.. వాహనాలకు భారీగా డిమాండ్..!
Auto Sales | ఈ ఏడాది దసరా శరన్నవరాత్రుల సీజన్లో వాహనాల విక్రయాలు భారీగా పెరగనున్నాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది దేవీ శరన్నవరాత్రుల రోజుల్లో దాదాపు 4వేల వాహనాలు డెలివరీ కనున్నాయి. వీటి విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
Auto Sales | ఈ ఏడాది దసరా శరన్నవరాత్రుల సీజన్లో వాహనాల విక్రయాలు భారీగా పెరగనున్నాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది దేవీ శరన్నవరాత్రుల రోజుల్లో దాదాపు 4వేల వాహనాలు డెలివరీ కనున్నాయి. వీటి విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వాహనాల డెలివరీ భారీగా పెరగనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది ఈ కాలంలో 3400 వాహనాలు డెలివరీ అయ్యాయి. డీలర్ల నివేదిక ప్రకారం.. ఈ సారి 1800 ఫోర్ వీలర్స్, 2200 ద్విచక్ర వాహనాలు డెలివరీ అయ్యే అవకాశం ఉందని అంచనా. వాస్తవానికి హిందువులు దేవి శరన్నవరాత్రులను శుభప్రదమైనవిగా భావిస్తారు. చాలామంది వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పటికే పలువురు వాహనాల కోసం అడ్వాన్స్ బుకింగ్ సైతం చేసుకుంటున్నారు. ఈ సారి నవరాత్రులతో పాటు ధన్తేరస్, దీపావళితో సహా ఇతర పండుగల సీజన్లో భారీగా వ్యాపారం జరుగుతుందని అంచనా. లగ్జరీ వాహనాల బుకింగ్స్ సైతం పెద్ద ఎత్తున జరిగాయి.
50 లక్షలకుపైగా విలువైన 500 వాహనాలు బుక్ అయ్యాయి. గతేడాది ఇలాంటి వాహనాలు 361 మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్‌తో రవాణా శాఖకు ఆదాయం సైతం పెరగనున్నది. మహీంద్రా కంపెనీ జనరల్ మేనేజర్ సంతోఖ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది వాహనాలు తొలి నుంచి ఎక్కువగానే విక్రయించినట్లు తెలిపారు. ఈ క్రమంలో నవరాత్రుల్లోనూ భారీగానే అమ్మకాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎక్కువ మంది కొత్త మోడల్స్‌కి ప్రాధాన్యం ఇస్తున్నారని టాటా మోటార్స్ వీరేంద్ర సింగ్ తెలిపారు. ఈ సారి హైబ్రిడ్ వాహనాల బుకింగ్‌లో భారీ పెరుగుదల కనిపిస్తుందని.. దీనికి కారణం 100శాతం పన్ను మినహాయింపేనని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 400 హైబ్రిడ్ వాహనాలు బుక్ అయ్యాయి. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలకు సైతం డిమాండ్ ఉంటుందని పేర్కొంటున్నారు. ఈవీ వాహనాల తయారీలో కంపెనీలకు ఈ ఏడాది ఇబ్బంది లేదని.. సెమీకండక్టర్ల లభ్యత పెరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాంతో వాహనాలు సకాలంలో డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందని వివరించారు. ఇక 2021లో 1,245 వాహనాలు, 2022లో 1475, 2023లో 3400 వాహనాలు డెలివరీలు కాగా.. 2024లో 4వేల వాహనాలు డెలివరీలు అయ్యే అవకాశం ఉందని అంచనా.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

