Audi Q8 e-tron E-SUV | లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి’.. భారత్‌లో న్యూ ఫ్లాగ్షిప్ ఎస్యూవీ కారు ఆవిష్కరించింది. ఆడి క్యూ8 ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ (Q8 e-tron) కారును ఆవిష్కరించింది. క్యూ8 ఈట్రాన్ ((Q8 e-tron) రెండు బాడీ స్టయిల్స్.. ఎస్యూవీ (SUV), స్పోర్ట్ బ్యాక్ (Sportback) వేరియంట్లు తీసుకొచ్చింది. ఈ కారు ధర రూ.1.14 కోట్లు (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది. క్యూ8 ఈ-ట్రాన్ ఎస్యూవీ ((Q8 e-tron SUV), క్యూ8 ఈ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ ((Q8 e-tron Sportback) కోసం ఈ నెల ప్రారంభంలోనే ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఆసక్తి గల వారు రూ.5 లక్షల టోకెన్ మొత్తం పే చేయాల్సి ఉంటుంది. త్వరలో డెలివరీ ప్రారంభిస్తారు.
ఇప్పటికే మార్కెట్లో విక్రయిస్తున్న ఆడి క్యూ ఈ-ట్రాన్ కారుకు.. న్యూ ఆడి క్యూ8 ఈ-ట్రాన్ ఎస్యూవీ, న్యూ ఆడి క్యూ8 ఈ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ ఫేస్ లిఫ్ట్‌గా వచ్చాయి. ఇంతకుముందు మార్కెట్లో ఉన్న వాటి కంటే కొత్త ఆడి క్యూ8 ఈ-ట్రాన్ ఎస్యూవీ షార్పర్గా కనిపిస్తుంది. ఎక్స్టీరియర్గా న్యూ బాడీ వర్క్ విత్ రీవర్క్డ్ గ్రిల్లె, లైట్స్, బంపర్స్, టెయిల్ గేట్ డిజైన్ చేశారు.
ఫ్లాగ్షిప్ ఆడి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లు .. మెమరీ ఫంక్షన్, హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ వంటి ఆప్షన్లతో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్ వస్తాయి. టూ టచ్ స్క్రీన్ యూనిట్స్ విత్ 10.1-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఎట్ ది టాప్, క్లైమేట్ కంట్రోల్ కోసం అడుగున 8.6-అంగుళాల స్క్రీన్ ఉంటుంది. క్యూ8 ఈ-ట్రాన్ కారు బ్యాంగ్ అండ్ ఉలుఫ్సెన్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్ రూఫ్, 360- డిగ్రీ కెమెరా, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, టీపీఎంఎస్ వంటి ఫీచర్లతో వస్తున్నది.
క్రోనోస్ గ్రే, గ్లాసియర్ వైట్, మైథోస్ బ్లాక్, ప్లాస్మా బ్లూ, సొనైరియా రెడ్, మ్యాగ్నైట్ గ్రే, సియామ్ బీజ్, మేడేరియా బ్రౌన్, మ్యాన్ హట్టన్ గ్రే కలర్ ఆప్షన్లలో వస్తాయి. పెరల్ బీజ్, ఒకాపీ బ్రౌన్, బ్లాక్ థీమ్స్ తో క్యాబిన్ డిజైన్ చేశారు.
ఆడి క్యూ8 ఈ-ట్రాన్ రెండు ట్రిమ్స్ 50 & 55 ట్రిమ్స్ లో వస్తుంది. 50 ట్రిమ్ డ్యుయల్ మోటార్ సెటప్ తో వస్తుంది. ఎస్యూవీ, స్పోర్ట్ బ్యాక్ వేరియంట్లలో 95 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తోపాటు గరిష్టంగా 338 బీహెచ్పీ విద్యుత్, 664 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 491 కి.మీ నుంచి 505 కి.మీ దూరం ప్రయాణించగల సామర్థ్యం ఉంటుంది.
55 ట్రిమ్ మరింత శక్తిమంతమైన డ్యుయల్-మోటార్ సెటప్ విత్ 408 బీహెచ్పీ విద్యుత్, 664 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 5.5 సెకన్లలోనే 100 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. 114 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో సింగిల్ చార్జింగ్ చేస్తే 600 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. ఎస్యూవీ, స్పోర్ట్‌బ్యాక్ కార్లకు చార్జింగ్ పోర్ట్‌లు ఎటువైపైనా అమర్చుకోవచ్చు. 22 కిలోవాట్ల ఏసీ చార్జర్, 170కిలోవాట్ల డీసీ ఫాస్ట్ చార్జింగ్ ఆఫర్ చేస్తున్నట్లు ఆడి తెలిపింది.