Audi Q7 Bold Edition | ఆడీ నుంచి క్యూ7 బోల్డ్ ఎడిషన్ ఆవిష్కరణ..!
Audi Q7 Bold Edition | ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) తన క్యూ7 ఎస్యూవీ కారులో స్పెషల్ ఎడిషన్ ‘చిరిస్టెన్డ్ ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్’ కారును ఆవిష్కరించింది.
Audi Q7 Bold Edition | ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) తన క్యూ7 ఎస్యూవీ కారులో స్పెషల్ ఎడిషన్ ‘చిరిస్టెన్డ్ ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్’ కారును ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.97.84 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఆడీ క్యూ7 బోల్డ్ ఎడిషన్ కారు బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీ, ఫ్రంట్ అండ్ రేర్‌లో బ్లాక్డ్ ఔట్ ఆడి రింగ్స్ తోపాటు గ్లాస్ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్లె , బ్లాక్ విండో, ఓఆర్వీఎంస్, రూఫ్ రెయిల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఈ కారు నాలుగు ఎక్స్టీరియర్ రంగులు – గ్లాసియర్ వైట్, మైథోస్ బ్లాక్, నవర్రా బ్లూ, సమురాయ్ గ్రే రంగుల్లో లభిస్తుంది. ఈ కారు లిమిటెడ్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.
ఇంకా క్యాబిన్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ 19-స్పీకర్ బీ అండ్ ఓ సౌండ్ సిస్టమ్, ఫోర్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పార్క్ అసిస్ట్ ప్లస్, 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్ రూఫ్, అంబియెంట్ లైటింగ్ తదితర ఫీచర్లు జత చేశారు. ఈ కారు ఏడు వేర్వేరు డ్రైవ్ మోడ్స్‌లో లభిస్తుంది. 3.0 లీటర్ల టర్బో చార్జ్డ్ వీ6 ఇంజిన్ విత్ 48వాట్ల మైల్డ్ హైబ్రీడ్ సిస్టమ్, హైబ్రీడ్ పవర్ ట్రైన్ సెటప్ ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 335 బీహెచ్పీ విద్యుత్, 500 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, బ్రాండ్ ఐకానిక్ క్వాట్ట్రో ఆల్ వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) సిస్టమ్ ద్వారా అన్ని వీల్స్‌కు పవర్ సరఫరా చేస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

