Audi Sedan A8 | త్వరలో ఆడీ సెడాన్ ఏ8 బుకింగ్స్.. ఆపై మార్కెట్లోకి..!
Audi Sedan A8 | జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ సెడాన్ మోడల్ ఏ8 కారు బుకింగ్స్ కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి.
Audi Sedan A8 | జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. తన ఫ్లాగ్షిప్ సెడాన్ మోడల్ కారు ఏ8 న్యూ వర్షన్ త్వరలో మార్కెట్లోకి రానున్నది. ఈ ఏడాదిలో ఆడి మార్కెట్లోకి విడుదల చేసిన రెండో కారు కానున్నది. త్వరలో ఏ8 లాంగ్‌వీల్ బేస్ సెడాన్ కారు బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. కొన్ని వారాల్లో ఆడీ ఏ8 న్యూవర్షన్ కారు మార్కెట్‌ను తాకనున్నది. త్వరలో బుకింగ్స్ మొదలు కానున్న నేపథ్యంలో సోమవారం ఆడీ ఏ8 కారు టీజర్ విడుదల చేసింది.
మెరుగ్గా డ్రైవింగ్ చేయడానికి, విలాసవంతమైన స్పేస్, అత్యున్నత టెక్నాలజీతోపాటు పలు రకాల ఆప్షన్లతో ఆడి8 కారు అందుబాటులోకి వస్తుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్‌సింగ్ ధిల్లాన్ చెప్పారు. ప్రతి కార్ల తయారీ సంస్థ లగ్జరీ స్పేస్ కలిగి ఉంటుంది. మా పోర్ట్‌ఫోలియోలో ఇది చాలా ముఖ్యమైన ఫ్లాగ్షిప్ కారు. మేం మా ఉత్పత్తుల (ఫ్లాగ్షిప్ మోడల్ కార్ల)ను ఉత్తమ ధరలకు వినియోగదారులకు అందుబాటులోకి తేవడానికి ఎల్లవేళలా ప్రయత్నిస్తున్నాం అని అన్నారు.
ఇది పూర్తిగా బిల్ట్ యూనిట్‌గా దిగుమతి చేయనున్నది ఆడి. ఇందులో 3-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమరుస్తారని భావిస్తున్నారు. కొద్ది రోజుల్లో బుకింగ్స్, కొన్ని వారాల్లో ఆవిష్కరణ తేదీ ప్రకటిస్తామని బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఫిబ్రవరిలో ఎస్యూవీ మోడల్ కారు క్యూ7ను విపణిలోకి విడుదల చేసింది. క్యూ7 ధర రూ.79.99 లక్షలు పలుకుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

