ఏటీఎఫ్.. వాణిజ్య సిలిండర్ సరే..వంటింటి గ్యాస్ బండ సంగతేంటి?!
No Relief on LPG | ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్), వాణిజ్య సిలిండర్ ధర తగ్గించిన కేంద్రం.. వంట గ్యాస్ సిలిండర్ ఊసే ఎత్తలేదు.
No Relief on LPG | విమానాలు నడిపేందుకు వాడే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరను కేంద్ర చమురు సంస్థలు 4.5 శాతం తగ్గించాయి. కానీ, అంతర్జాతీయంగా ధరలు తగ్గినా.. సామాన్యుడు ఉపయోగించే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర మాత్రం తగ్గించలేదు. కానీ, సాధారణ గృహిణులు వంటింట్లో వాడే 14.2 కిలోల సిలిండర్ ఎల్పీజీ గ్యాస్ ధర మాత్రం రూ.1053 యధాతథంగా కొనసాగించాలని నిర్ణయించాయి.పండుగల సీజన్లోనైనా ఊరట లభిస్తుందనుకున్న సామాన్యుడి ఆశలు కేంద్రం అడియాసలు చేసింది.
కేంద్ర చమురు సంస్థలు 19 కిలోల వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.25.5 తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రూ.1885 నుంచి రూ.1,859.50 లకు లభిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత జూన్ నుంచి కమర్షియల్ సిలిండర్ ధర తగ్గించడం ఇది ఆరోసారి. అంతర్జాతీయంగా క్రూడాయిల్, సహజ వాయువు ధరలు తగ్గుముఖం పట్టడంతో వాణిజ్య సిలిండర్ ధర మరోమారు తగ్గించాయి కేంద్ర చమురు సంస్థలు. దీంతో వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.494.50 తగ్గుముఖం పట్టింది.
ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధర 4.5 శాతం తగ్గడంతో దేశ రాజధాని ఢిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.1,15,520.27 నుంచి రూ.5,521.17 తగ్గింది. స్థానిక పన్నులను బట్టి వివిధ రాష్ట్రాల్లో ఏటీఎఫ్ ధరలు మారతాయి. వాణిజ్య సిలిండర్ ధర నెలకోసారి, ఏటీఎఫ్ ధరలు 15 రోజులకోసారి కేంద్ర చమురు సంస్థలు సవరిస్తుంటాయి. కానీ, గత నెల 16న ఏటీఎఫ్ ధరలను సవరించలేదు. సెప్టెంబర్ ఒకటో తేదీన 0.7 శాతం ఏటీఎం ధరలు తగ్గించాయి. ఇక రిటైల్ మార్కెట్లో లీటర్ పెట్రోల్/ డీజిల్ ధరలు దాదాపు ఆరు నెలలుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.89.62లకు లభిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

