Reliance AGM | జియో ఐపీవోకు సిద్ధం.. మైజియోలో ఏఐ సేవలు.. జియో కాల్ ఏజెంట్.. రిలయన్స్ ఏజీఎంలో కీలక నిర్ణయాలు
Reliance AGM : భారతీయ పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఐపీవోకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఐపీవోకు అవసరమైన పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్త సెబీకి నేడు సంస్థ సమర్పించింది. ఈ విషయాన్ని రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ వెల్లడించారు.
Reliance AGM : భారతీయ పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఐపీవోకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఐపీవోకు అవసరమైన పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్త సెబీకి నేడు సంస్థ సమర్పించింది. ఈ విషయాన్ని రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ వెల్లడించారు. ముంబైలోని రిలయన్స్ సంస్థ ప్రధాన కార్యాలయంలో రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం) నేడు జరిగింది. ఈ సందర్భంగా రిలయన్స్ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన వివరాల్ని సంస్థ అధినేత ముకేష్ అంబానీతోపాటు జియో ఎండీ ఆకాశ్ అంబానీ వెల్లడించారు.
ఈ వివరాల ప్రకారం త్వరలోనే రిలయన్స్ జియో ఐపీవోకు వెళ్లనుంది. ఈ రోజే దీనికి అవసరమైన పత్రాలను సంస్థ సెబీకి సమర్పించింది. సెబీ నుంచి దీనికి అనుమతులు వచ్చిన తర్వాత రిలయన్స్ జియో సంస్థ ఐపీవోకు వెళ్తుంది. ఈ ఐపీవో ద్వారా సుమారు 3 బిలియన్ డాలర్లు (రూ.25 వేల కోట్లు) నిధులు సేకరించాలని సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది. దీని ద్వారా 27 కోట్ల కొత్త షేర్లను కంపెనీ జారీ చేస్తుంది. రిలయన్స్ సంస్థ కొన్ని కొత్త టెక్నాలజీలను కూడా ప్రవేశపెట్టింది. అవి జియో టెలిఫ్రేం, జియో కాల్ ఏజెంట్. జియో టెలిఫ్రేం.. వాయిస్ ఫస్ట్ ఏజెంటిక్ ఏఐ. ప్రతి ఇంటిని స్మార్ట్‌హోంగా మార్చేందుకు రూపొందింది. ఇంట్లో, రోజువారీ జీవితంలో చేసే అనేక పనుల్ని ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా నిర్వహించవచ్చు. హోం మేనేజ్మెంట్, ఎంటర్టైన్మెంట్, షాపింగ్ అసిస్టెన్స్, గెస్ట్ మేనేజ్మెంట్, ఫ్యామిలీ కేర్ సర్వీసెస్ వంటివి దీని ద్వారా చేసుకోవచ్చు. హేజియో పేరుతో రిలయన్స్ సంస్థ కొత్త కాల్ ఏజెంట్‌ను తీసుకొచ్చింది. రిలయన్స్ నెట్వర్క్ వాడుతుంటే చాలు ప్రత్యేకంగా యాప్ డౌన్లోడ్ చేయకుండానే దీన్ని వాడుకోవచ్చు. ఫోన్ కాల్ మధ్యలో ‘హేజియో’ అంటే చాలు ఇది యాక్టివేట్ అవుతుంది.
ఒక కాల్ మాట్లాడుతున్నప్పుడే క్యాబ్ బుక్ చేయడం, ఫుడ్ ఆర్డర్ చేయడం, రెస్టారెంట్లో సీట్ రిజర్వ్ చేయడం, మీటింగ్ సెట్ చేయడం వంటి టాస్క్‌లు ఇది పూర్తి చేస్తుంది. ఈ ఏడాది చివరికల్లా ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ కాల్ మధ్యలో కూడా దీన్ని వాడొచ్చు. 10 మంది వరకు కాలర్స్ ఉన్నప్పుడు స్పీకర్‌ను గుర్తించడం, కావాల్సిన లాంగ్వేజ్‌లో ట్రాన్స్క్రిప్షన్ అందించడం, కాల్ తర్వాత సమ్మరైజ్ అందించడం, రిమైండర్స్ వంటివి చేస్తుంది. జియో నెట్వర్క్ వాడే అందరూ యూజ్ చేసే మై జియో యాప్ త్వరలో పర్సనల్ ఏఐ రిలేషన్షిప్ మేనేజర్‌గా మారుతుంది. దీని ద్వారా టెలికాం సేవల్ని సులభంగా పొందవచ్చు. కావాల్సిన రోమింగ్ ప్లాన్స్‌ను సులభంగా ఎంచుకోవచ్చు. రొటీన్ అకౌంట్ చెక్కులను కూడా ఆటోమేటిక్‌గా పొందవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

