Loan Repayment | ఆఖర్లో అయితే లాసే.. రుణ చెల్లింపుల్లో లాభం ఇలా..
మనలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు బ్యాంకు ల్లో లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల్లో రుణాన్ని తీసుకోవడం సహజం. అయితే ఆ రుణ భారాన్ని వీలైనంత త్వరగా తీర్చేసుకుందామనుకొని కొన్ని పొరపాట్లు చేస్తూంటారు.
Loan Repayment | మనలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు బ్యాంకు ల్లో లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల్లో రుణాన్ని తీసుకోవడం సహజం. అయితే ఆ రుణ భారాన్ని వీలైనంత త్వరగా తీర్చేసుకుందామనుకొని కొన్ని పొరపాట్లు చేస్తూంటారు. దీనివల్ల నష్టాల పాలవుతూంటారు. అందుకే రుణ చెల్లింపుల విషయంలో ఎప్పుడు? ఎలా? అన్నది అత్యంత ముఖ్యమైన అంశం. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో లోన్లు తీసుకున్నప్పుడు.. వడ్డీతో కలిపి ఆ మొత్తాన్ని నిర్ణీత లేదా రుణగ్రహీత ఎంచుకున్న కాలవ్యవధికి సమాన ఈఎంఐలుగా పంచుతారు. అయితే ఈ నెలవారీ వాయిదాల్లో మొదట చెల్లిస్తూపోయే వాటిలో ఎక్కువ మొత్తం రుణంపై రుణదాతలు వసూలుచేసే వడ్డీనే ఉంటుం ది.
కాలం గడుస్తున్నకొద్దీ చివర్లో ఉండే ఈఎంఐల్లో వడ్డీకన్నా అసలే ఉంటుంది. అంటే.. రుణం తీసుకున్న తొలినాళ్లలో చెల్లించే ఈఎంఐల్లో ఎక్కువ మొత్తం వడ్డీ కిందనే పోతుంది. అసలు రుణంలో మైనస్ అయ్యేది చాలా తక్కువ. అలాగే ఆఖర్లో చెల్లించే ఈఎంఐల్లో వడ్డీకన్నా అసలు రుణమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రుణ భారం తగ్గించుకోవాలనుకునేవారు మొదట్లోనే వీలైనంత చెల్లించడం మంచిది. ఆఖర్లో ఒకేసారి చెల్లించడం కన్నా ఈఎంఐలను అనుసరించడమే లాభదాయకం.
లోన్ పోర్టబులిటీ
రుణాలపై వివిధ బ్యాంకులు, సంస్థలు రకరకాల వడ్డీరేట్లను అనుసరిస్తూంటాయి. రుణగ్రహీత సిబిల్ స్కోర్‌తోపాటు మరికొన్ని అంశాలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే మనం తీసుకున్న రుణంపై వడ్డీరేటు ఎక్కువగా ఉందనుకుంటే.. ఎందులో తక్కువగా ఉందో తెలుసుకుని ఆ మొత్తం రుణాన్ని అక్కడికి మార్చుకోవడం ఉత్తమం. దీన్నే లోన్ పోర్టబులిటీ అంటారు. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. కానీ ఈ ప్రక్రియకు కొన్ని చార్జీలు వర్తిస్తాయి. వీటన్నిటినీ కలిపి లెక్కించే రుణాన్ని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకోవడం లాభమా? నష్టమా? అన్నది తేల్చుకోవాలి. లేకపోతే భారం మరింత పెరిగే ప్రమాదం ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parakala Prabhakar | ‘సర్’ వ్యతిరేక నిరసనలో పరకాల ప్రభాకర్
Rajiv Yuva Vikasam | కొందరికే యువవికాసం.. యువతకు మరోసారి కాంగ్రెస్ దగా!
Uttam Kumar Reddy | పెత్తనం లేని ఉత్తమ్..! ఉత్సవ విగ్రహంగా మిగిలిన సీనియర్ మంత్రి
YTPC | అంధకారంలో ఆశాదీపం..! కేసీఆర్ కలల ప్రాజెక్టు వైటీపీఎస్ ఐదో యూనిట్ సింక్రనైజేషన్ పూర్తి
Hardeep Puri | ఎప్స్టీన్తో హర్దీప్ రహస్య సమావేశం..! ఫొటోలు బయటకు రావడంతో రాజకీయ దుమారం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

