Vehicle Insurance | కొత్త వెహికల్ కొంటున్నారా.. ఇన్సూరెన్స్ విషయంలో జాగ్రత్త సుమా..!
మీరు కొత్త కారు లేదా బైక్ కొంటున్నారా? అయితే వాటికి ఇన్సూరెన్స్ ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.
Vehicle Insurance | మీరు కొత్త కారు లేదా బైక్ కొంటున్నారా? అయితే వాటికి ఇన్సూరెన్స్ ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. తగిన ఇన్సూరెన్స్ కవరేజ్‌ను, సరైన జనరల్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను ఎంచుకోవడంలో పొరపాటు చేస్తే వాహనానికి ఏదైనా జరిగినప్పుడు మీ సొంత ఖర్చులు తడిసిమోపెడవుతాయి జాగ్రత్త!
కొత్త వాహనాల బీమా సమయంలో జరిగే కాస్ట్లీ మిస్టేక్స్ ఇవి..
1. సరైన ఐడీవీని ఎంచుకోకపోవడం:
వాహనానికి డ్యామేజి జరిగినా, చోరీకి గురైనా ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించే గరిష్ఠ మొత్తాన్ని ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వాల్యూ (ఐడీవీ)గా వ్యవహరిస్తారు. ఈ విలువకు తగినట్టే ప్రీమియం ఉంటుంది. ప్రీమియంలను తగ్గించుకోవాలన్న ఉద్దేశ్యంతో తక్కువ ఐడీవీని ఎంచుకుంటే నష్టమే.
2. ప్రాథమిక అంశాల్ని శోధించకపోవడం:
వాహన ఇన్సూరెన్స్ పాలసీని లేదా అది అందించే సంస్థను ఎంపికచేసుకునే ముందు ప్రాథమిక అంశాల్ని పరిశోధించి తెలుసుకోకపోవడం చాలామంది చేసే పొరపాటు. వివిధ సంస్థలు అందిస్తున్న పాలసీలు, వాటి ఫీచర్లు, క్లెయిం సెటిల్మెంట్ రికార్డులు వంటివి చూడాలి.
3. పాలసీలను పోల్చిచూడకపోవడం:
ఇన్సూరెన్స్ సంస్థల్ని రీసెర్చ్చేసి వాటి తీరుతెన్నుల్ని గ్రహించడంతోపాటు వివిధ పాలసీలను పోల్చిచూసుకోవాలి. ఆలోచన లేకుండా ఆటోమాటిక్‌గా లభించే పాలసీని, చౌకగా లభించే పాలసీని ఎంచుకోవద్దు. నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం వెచ్చించాలి. కవరేజీ ఎంపికలో ప్రీమియం ధరలమీదే దృష్టిపెట్టకండి.
4. ఎన్సీబీని ఉపయోగించుకోకపోవడం:
ఒక పాలసీ సంవత్సరంలో ఎటువంటి క్లెయింలు చేయకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు నో-క్లెయిం బోనస్ (ఎన్సీబీ)ను ఆఫర్ చేస్తుంటాయి. క్లెయింలు లేని సంవత్సరాలకు, జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నందుకు రివార్డుగా సంస్థలు ప్రీమియంపై డిస్కౌంట్లు ఇస్తుంటాయి. అటువంటి ఎన్సీబీలను వాడుకోకుండా, బదిలీ చేసుకోకుండా పలువురు ఇన్సూరెన్స్ సంస్థల్ని తరచూ మార్చేస్తుంటారు. మీ కారు లేదా బైక్ ప్రీమియంలపై గరిష్ఠ ఆదా పొందేందుకు ఇన్సూరెన్స్ సంస్థను మార్చేటపుడు మీ ఎన్సీబీతో క్లెయింలు లేని సంవత్సరాల్ని అనుసంధానించండి. దీంతో మీకు దీర్ఘకాలిక వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి.
5.యాంటీ-థెఫ్ట్ డివైజ్‌లను అమర్చకపోవడం:
బద్దకంతోనో, ఖర్చవుతుందనో చాలా మంది వాహనాల్లో యాంటీ-థెప్ట్/సెక్యూరిటీ డివైజ్‌లను ఇన్స్టాల్ చేసుకోరు. దీంతో మీ వాహనం చోరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు జీపీఎస్ ట్రాకర్లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్లు, గేర్లాక్స్ తదితర సెక్యూరిటీ డివైస్‌లు అమర్చుకుంటే వాహనం చోరి కాకపోవడంతో పాటు మీ ప్రీమియం చెల్లింపులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు కూడా లభిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

