Apple – iPhone | ఐ-ఫోన్ నీటిలో పడిందా..? ఏం చేయాలో చెప్పిన ఆపిల్..!
Apple-iPhone | ఐ-ఫోన్ నీటిలో పడితే బియ్యం సంచిలో పెట్టొద్దని, కనెక్టర్ కింది వైపు ఉంచి డివైజ్ ను నెమ్మదిగా కొట్టి.. పొడిగా, గాలి వీస్తున్న ప్రదేశంలో ఉంచాలని ఆపిల్ తెలిపింది. లిక్విడ్ డిటెక్షన్ అలర్ట్ సాయంతో చెక్ చేయొచ్చునని పేర్కొంది.
Apple – iPhone | ఇప్పుడు ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ హస్తభూషణం.. మనం వాడుతున్నప్పుడు స్మార్ట్ ఫోన్ నీటిలో పడటం గానీ, కింద పడిపోవడం గానీ జరుగుతుంది. కొందరు సెల్ ఫోన్ నీటిలో పడితే వెంటనే దాన్ని తుడిచేసి ఇంట్లో ఒక బియ్యం సంచిలో ఉంచి, మరుసటి రోజు తీసి చార్జింగ్ పెడతారు. ఫోన్ లో చేరిన నీటి తొలగింపునకు యూజర్లు సొంత చిట్కాలు, ప్రయత్నాలు పాటిస్తుంటారు. దీనివల్ల ఫోన్ మరింత దెబ్బ తినే ముప్పు పొంచి ఉందని ఆపిల్ హెచ్చరించింది.
‘ఐ-ఫోన్’ను బియ్యం సంచిలో పెట్టొద్దని, దానివల్ల బియ్యంలో ఉండే సూక్ష్మ రేణువులు ఫోన్‌ను దెబ్బ తీస్తాయని ఆపిల్ పేర్కొంది. దానికి బదులు ఫోన్లో చేరిన నీటిని తొలగించడానికి కనెక్టర్ కింది వైపు ఉంచి డివైజ్ ను నెమ్మదిగా కొట్టి.. పొడిగా, గాలి వీస్తున్న ప్రదేశంలో ఉంచాలని తెలిపింది. అలా అర్ధగంట ఉంచిన తర్వాత యూఎస్బీ-సీ పోర్ట్ గానీ, లైటెనింగ్ కనెక్టర్ సాయంతో గానీ చార్జింగ్ చేయండి. స్మార్ట్ ఫోన్లో చేరిన నీరు పోవడానికి ఒక రోజు పట్టొచ్చునని, లిక్విడ్ డిటెక్షన్ అలర్ట్ సాయంతో ఫోన్ పరిస్థితి తెలుసుకోవచ్చునని పేర్కొంది.
అత్యవసరంగా చార్జి చేయాల్సి వచ్చినప్పుడు తడిగా ఉన్న ఫోన్లో లిక్విడ్ డిటెక్షన్ ఓవర్ రైడ్ చేసే వెసులుబాటు ఉంటుందని ఆపిల్ తెలిపింది. కొత్తగా ఐఫోన్ కొనుగోలు చేసిన వారు ఈ సమస్యపై ఆందోళన చెందనక్కర్లేదని పేర్కొంది. 20 అడుగుల్లోతు నీటిలో అర్ధగంట సేపు ఉన్నా, ఐఫోన్ పని చేస్తుందని వివరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

