iPhone Production: ఇండియాలో రెండింతలు పెరిగిన యాపిల్ ఐఫోన్ల ఉత్పత్తి..
iPhone Production: గత ఏడాది భారత్‌లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ఆ ఏడాది సుమారు 14 బిలియన్ల డాలర్ల ఖరీదైన ఐఫోన్లను ఇండియాలో తయారు చేశారు. ఐఫోన్ల ఉత్పత్తిని రెండింతలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ: గత ఏడాది భారత్‌లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల ఉత్పత్తి(iPhone Production) విపరీతంగా పెరిగింది. ఆ ఏడాది సుమారు 14 బిలియన్ల డాలర్ల ఖరీదైన ఐఫోన్లను ఇండియాలో తయారు చేశారు. ఐఫోన్ల ఉత్పత్తిని రెండింతలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే చైనా నుంచి యాపిల్ సంస్థ దృష్టి మళ్లించడం వల్ల.. భారత్‌లో యాపిల్ ఉత్పత్తుల జోరు పెరిగింది. దీనిపై బ్లూమ్‌బర్గ్‌లో ఓ నివేదికను ప్రచురించారు. భారత్‌లో సుమారు 14 శాతం యాపిల్ ఉత్పత్తుల తయారీ జరుగుతున్నదని ఆ సంస్థ వెల్లడించింది. అంటే ఏడు డివైస్‌లను తయారు చేస్తే దాంట్లో ఒకటి ఇండియాలోనే తయారు అవుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో వెల్లడించింది. భారత్‌లో ఉత్పత్తి పెంచడం వల్ల .. ఇన్నాళ్లూ చైనాపై ఆధారపడ్డి యాపిల్ సంస్థ.. ఇప్పుడు ఆ దేశంపై తన అవసరాన్ని తగ్గించుకున్నది. ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనూ ఉత్పత్తి తగ్గినట్లు తెలుస్తోంది.
విదేశీ కంపెనీ పరిశ్రమలకు భారత సర్కారు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను పెంచేశాయి. 2017 నుంచి యాపిల్ సంస్థ ఇండియాలో ఐఫోన్లను తయారీ చేస్తున్నది. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) స్కీమ్ ద్వారా యాపిల్ సంస్థ లబ్ధి పొందినట్లు స్పష్టం అవుతోంది. పదేళ్ల క్రితం ఇండియాలో యాపిల్ డివైస్‌లను ఉత్పత్తి శూన్యంగా ఉండేది. ఇప్పుడు మాత్రం ఐఫోన్‌కు చెందిన లేటెస్ట్ వర్షన్స్ ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Apple
- china
- India
- iPhone production
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

