అమెరికాలో మరో బ్యాంక్ మూసివేత
అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కొద్ది వారాలకే మరో బ్యాంక్ మూతపడింది. తీవ్ర చిక్కుల్లో పడ్డ ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను రెగ్యులేటర్లు మూసివేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు.
న్యూయార్క్, మే 1: అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కొద్ది వారాలకే మరో బ్యాంక్ మూతపడింది. తీవ్ర చిక్కుల్లో పడ్డ ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను రెగ్యులేటర్లు మూసివేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. వెనువెంటనే ఆ బ్యాంక్ డిపాజిట్లన్నింటినీ, పలు రుణ ఆస్తుల్ని అమెరికాలో అతిపెద్ద బ్యాంక్‌ల్లో ఒకటైన జేపీ మోర్గాన్ ఛేజ్ బ్యాంక్‌కు విక్రయించారు.
రెండు నెలల్లో వరుస బ్యాంకింగ్ వైఫల్యాల్లో శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ మూడవది. సిగ్నేచర్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌లు మార్చి నెలలో వెంటవెంటనే పతనంకావడంతో డిపాజిట్‌దార్లలో ఆందోళన పెరిగి ఫస్ట్ రిపబ్లిక్ నుంచి భారీగా డిపాజిట్లు ఉపసంహరించుకున్నారు. యూఎస్‌లో పెద్ద బ్యాంక్‌ల్లో గత ఏడాది చివరినాటికి ఫస్ట్ రిపబ్లిక్‌ది 14 వ ర్యాంక్. 8 రాష్ర్టాల్లోని 84 ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ శాఖలు..జేపీ మోర్గాన్ ఛేజ్ బ్యాంక్ శాఖల్లా రీఓపెన్ అవుతాయని, డిపాజిటర్లు వారి డిపాజిట్లను ఉపయోగించుకోవచ్చని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- America
- Another bank
- Closed
- Crisis
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

