Anant Ambani | అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో ముకేశ్ భావోద్వేగం..ఏమైందంటే..!
Anant Ambani | ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో అనంత్ వ్యాఖ్యలతో ముకేశ్ అంబానీ కండ్లలో నీళ్లు తిరిగాయి.
Anant Ambani | ప్రపంచ బిలియనీర్లలో ఒకరైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం త్వరలో జరుగనున్నది. దానికి ముందు ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెండ్లి కొడుకు అనంత్ అంబానీ మాటలతో ముకేష్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. తన తల్లిదండ్రులు ముకేశ్ అంబానీ, నీతా అంబానీలకు అనంత్ అంబానీ కృతజ్ఞతలు తలుపుతున్నప్పుడు ముకేశ్ అంబానీ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. తాను ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడు తన తల్లిదండ్రులు అందించిన మద్దతు విషయం అనంత్ అంబానీ చెబుతున్నప్పుడు ముకేశ్ అంబానీ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
`ఇదంతా మా అమ్మ చేసింది.. నాకోసం ఆమె చాలా కష్ట పడింది. ఆమె నాలుగు నెలలుగా రోజూ 18-19 గంటలు నాకోసం కష్ట పడ్డారు. అందుకు అమ్మకు నేను కృతజ్ఞుడను. అమ్మా మీరు చేసిన ప్రతి పనికీ ధన్యవాదాలు అని అనంత్ పేర్కొన్నాడు. ‘మా అమ్మానాన్న ఎల్లవేళలా నాకు అండగా నిలిచారు. నేనేదైనా సాధించగలననే ఆత్మ విశ్వాసం నాకు కల్గించారు. నన్ను అర్థం చేసుకున్న మా అమ్మా నాన్నకు ఎప్పటికీ కృతజ్ఞుడను’ అని అన్నారు ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ మాట్లాడుతూ తన చిన్న కొడుకులోనే మరణించిన తన తండ్రి ధీరూభాయ్ అంబానీని చూసుకుంటున్నట్లు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

