Amazon Layoffs | లేఆఫ్స్‌పై అమెజాన్ ఆడిబుల్ సీఈవో కీలక వ్యాఖ్యలు
Amazon Layoffs : టెక్ ప్రపంచంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్ధితి నెలకొంది. ఆర్ధిక మందగమనం, వ్యయ నియంత్రణ చర్యల పేరిట టెక్ దిగ్గజాలు మెటా, ఫేస్బుక్, అమెజాన్, గూగుల్ సహా పలు కంపెనీలు లేఆఫ్స్‌కు తెగబడుతున్నాయి.
Amazon Layoffs : టెక్ ప్రపంచంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్ధితి నెలకొంది. ఆర్ధిక మందగమనం, వ్యయ నియంత్రణ చర్యల పేరిట టెక్ దిగ్గజాలు మెటా, ఫేస్బుక్, అమెజాన్, గూగుల్ సహా పలు కంపెనీలు లేఆఫ్స్‌కు తెగబడుతున్నాయి. కొలువుల కోత ఎప్పుడు తమకు ఎసరు పెడుతుందనే గుబులుతో టెకీలు బిక్కుబిక్కుమంటున్నారు.
ఇక లేఆఫ్స్‌పై అమెజాన్ ఉన్నతాధికారి బాంబు పేల్చారు. లేఆఫ్స్ ఉండవని చెప్పేందుకు అమెజాన్ ఆడిబుల్ సీఈవో బాబ్ కరిగన్ నిరాకరించారు. లేఆఫ్స్ ఉండవని చెప్పకపోవడం ద్వారా అమెజాన్ యూనిట్లో మరిన్ని కొలువుల కోతలు ఉండవచ్చనే సంకేతాలు పంపారు. కంపెనీ ఇటీవల 5 శాతం ఉద్యోగులను తొలగించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం టెకీల్లో కలవరం కలిగిస్తోంది.
ఇటీవల జరిగిన ఉద్యోగుల అంతర్గత సమావేశంలో ఈ ఏడాది మరోసారి లేఆఫ్స్ ఉంటాయా అని నేరుగా ఓ ఉద్యోగి కరిగన్ను ప్రశ్నించగా నేరుగా బదులివ్వకుండా తాను ఎలాంటి భరోసాలు ఇవ్వలేనని ఎప్పుడూ చెబుతుంటానని, కస్టమర్ల సేవలపై ఫోకస్ పెట్టాలని అన్నారు. లేఆఫ్స్ కలకలంతో టెకీల్లో అనిశ్చితి నెలకొన్న వేళ లేఆఫ్స్ ఉండవని కరిగన్ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం ఉద్యోగుల్లో అభద్రతను పెంచుతోంది.
Read More :
Narayana Murthy | మేం ఆప్యాయంగా ఉంటాం.. అల్లుడు సునాక్‌తో బంధంపై ఇన్ఫీ నారాయణమూర్తి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

