Rishi Sunak – Narayana Murthy | ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి, బ్రిటన్ ప్రధాని- తన అల్లుడు రిషి సునాక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ ప్రధానిగా అసాధారణ రీతిలో తన అల్లుడు రిషి సునాక్ ఎదిగారని ఎన్డీటీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో అన్నారు. అయినా తాను ఇప్పటికీ డిప్లమాటిక్ వైఖరినే కొనసాగిస్తున్నారు. నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తిని రిషి సునాక్ పెండ్లాడారు. 2022లో బ్రిటన్ ప్రధానిగా ఎన్నిక అయ్యారు.
‘విదేశీయులంగా విదేశీ వ్యవహారాలపై స్పందించకపోవడమే మనకు మర్యాద. కనుక దీనిపై మనం చర్చించకపోవడమే మంచిది. మేం చాలా సన్నిహితంగా, సామరస్యంగా ఉంటాం. వ్యక్తిగత సంబంధాల్లో ఆప్యాయత ప్రదర్శించుకుంటాం’ అని తెలిపారు. ‘నేను నా పిల్లలతో సమయం గడుపుతాను. ఎక్కువ సమయం కుటుంబానికి, నా భార్యకే కేటాయిస్తాను` అని నారాయణ మూర్తి చెప్పారు.