Amazon Mega Electronics sale : అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ సేల్ ఫిబ్రవరి 12న ప్రారంభమై ఫిబ్రవరి 19 వరకూ కొనసాగుతుంది. సేల్‌లో భాగంగా ఈ-కామర్స్ సైట్ పలు స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్స్, ల్యాప్టాప్స్ సహా పలు ఉత్పత్తులపై 80 శాతం వరకూ డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తోంది.
ఇక ఎస్బీఐ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై కస్టమర్లు అదనంగా పది శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందే వెసులుబాటు ఉంది. ఈ అమేజింగ్ ఆఫర్స్‌తో మీరు కోరుకునే గాడ్జెట్స్‌ను తక్కువ ధరకు పొందడమే కాకుండా మీ ఆత్మీయులకూ గిఫ్ట్‌గా అందించవచ్చు అమేజ్‌ఫిట్ యాక్టివ్ స్మార్ట్‌వాచ్ అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్‌లో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.
ఏఐ ఫిట్నెస్ కోచింగ్, జీపీఎస్ ట్రాకింగ్, బ్లూటూత్ కాలింగ్ వంటి హాట్ ఫీచర్లతో పాటు హెల్త్, కనెక్టివిటీలోనూ ఈ వాచ్ అడ్వాన్స్డ్ ఫీచర్లను కలిగిఉంది. సేల్‌లో భాగంగా రూ. 12,999 విలువైన ఈ స్మార్ట్‌వాచ్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇక బోట్ వేవ్ సిగ్మా స్మార్ట్‌వాచ్, బోట్ ఇయర్‌పాడ్స్, డెల్ 14 ల్యాప్‌టాప్ సహా పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆకర్షణీయ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారు.
Read More :
South Korea | పిల్లల్ని కంటే 62 లక్షలు.. ఉద్యోగులకు దక్షిణ కొరియా కంపెనీ భారీ ఆఫర్