హైదరాబాద్, ఆగస్టు 12: ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్ అంచనాలకుమించి రాణించింది. గడిచిన త్రైమాసికానికిగాను రూ.192.14 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.132.01 కోట్ల కంటే 45.55 శాతం అధికం.
అలాగే ఏడాది క్రితం రూ.2,620 కోట్లుగా ఉన్న కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం గత త్రైమాసికానికిగా రూ.2,769.94 కోట్లకు చేరుకున్నది. నిర్వహణ ఖర్చులు రూ.2,460 కోట్ల నుంచి రూ.2,560 కోట్లకు పెరిగినట్లు కంపెనీ సీఎండీ జయదేవ్ గల్లా తెలిపారు. ఆటోమొటివ్, టెలికం, యూపీఎస్ విభాగాలు అంచనాలకుమించి రాణించడంతో ఆదాయ, లాభాల్లో భారీ వృద్ధి నమోదైందన్నారు.