హైదరాబాద్, సెప్టెంబర్ 28: ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్..తన పేరును అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్గా మార్చుకున్నది. ఈ వ్యూహాత్మక మార్పుతో ఎనర్జీ అండ్ మొబిలిటీ రంగంలో సమగ్ర పరిష్కారాల సంస్థగా అవతరించినట్టు కానున్నది.
దీంతో అమర రాజా బ్యాటరీ పరిధిలోని ఆటోమొటివ్ బ్యాటరీలు, ఇండస్ట్రీయల్ బ్యాటరీస్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సొల్యుషన్స్, లిథియం-అయాన్ సెల్ తయారీ, ఈవీ చార్జర్లు, రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యుషన్స్ వంటి విభాగాలు కొత్త సంస్థ పరిధిలోకి రానున్నాయి.