Ajay Banga | ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అజయ్ బంగా
Ajay Banga | ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతి అమెరికన్ అజయ్ బంగా బాధ్యతలు స్వీకరించారు.
Ajay Banga | ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతి అమెరికన్ అజయ్ బంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)ల్లో ఒక సంస్థకు అధిపతిగా ఎన్నికైన తొలి నల్ల జాతీయుడు. గత నెల మూడో తేదీన జరిగిన ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సమావేశంలో అజయ్ బంగా (63)ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయన ఈ పదవిలో ఐదేండ్ల పాటు కొనసాగుతారు.
ప్రపంచబ్యాంక్ అధ్యక్ష పదవికి అజయ్ బంగా పేరును గత ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. అజయ్ బంగా.. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ఇండో- అమెరికన్ కూడా. ఫిబ్రవరిలోనే ప్రపంచబ్యాంకు అధ్యక్షుడిగా డేవిడ్ మాల్పాస్ రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడంతో ఆయన స్థానంలో అజయ్ బంగా ఎన్నికయ్యారు.
సంస్థ నూతన అధ్యక్షుడిగా నియమితులైన అజయ్ బంగా.. బ్యాంకు ప్రధాన కార్యాలయానికి వచ్చినప్పుడు సంస్థ అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ‘ప్రపంచ బ్యాంక్ గ్రూప్ నూతన అధ్యక్షుడు అజయ్ బంగాకు స్వాగతం పలుకుతున్నాం. దారిద్య్ర రహిత ప్రపంచ నిర్మాణానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని ప్రపంచబ్యాంక్ కార్యాలయం ట్వీట్ చేసింది.

ప్రపంచబ్యాంకు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అజయ్ బంగాకు ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిష్టాలినా జార్జివా అభినందనలు తెలిపారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నికవ్వక ముందు ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సేవల సంస్థ మాస్టర్ కార్డ్ సీఈఓగా పని చేశారు.
1959 నవంబర్ 10న పుణెలో అజయ్ బంగా జన్మించారు. అజయ్ బంగా తండ్రి హర్బజన్ బంగా.. భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్‌గా పని చేశారు. అజయ్ బంగా విద్యాభ్యాసం జలంధర్, సిమ్లాలో సాగింది. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2016లో భారత ప్రభుత్వం అజయ్ బంగాను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

