Airtel Disney Plus Hotstar | టెలికం సంస్థలు దేశమంతా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాయి. అందుకు అనుగుణంగా తమ సబ్స్క్రైబర్లను పెంచుకోవడానికి ఆకర్షణీయ రీచార్జి ప్లాన్లు ఆఫర్ చేస్తున్నాయి. ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్ టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం డిస్నీ+ హాట్‌స్టార్ సబ్ స్క్రిప్షన్తో కొత్త టారిఫ్ తెచ్చింది.
రూ.869 టారిఫ్‌తో రీచార్జీ చేసుకుంటే ప్రతి రోజూ 64 కేబీపీఎస్ వేగంతో 2 జీబీ డేటా అందుతోంది. అన్ లిమిటెడ్ కాల్స్‌తోపాటు, రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. ఈ టారిఫ్ 84 రోజుల కాల పరిమితి కలిగి ఉంటుంది. దీనిపై మూడు నెలలు డిస్నీ + హాట్ స్టార్ (మొబైల్ వర్షన్) సబ్స్క్రిప్షన్ ఉంటుంది. 5జీ నెట్ వర్క్ ప్రాంతాల్లో అన్ లిమిటెడ్ 5జీ డేటా పొందొచ్చు. వీటితోపాటు మూడు నెలలు ఉచిత అపోలో 24/7 సర్కిల్ మెంబర్ షిప్, ఫ్రీ హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ కూడా పొందొచ్చు.
దీనికి ముందు రిలయన్స్ జియో కూడా రూ.808 టారిఫ్‌తో 84 రోజుల గడువు గల ప్లాన్ తెచ్చింది. దీనిపై మూడు నెలల డిస్నీ + హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ పొందొచ్చు. రోజూ 2 జీబీ డేటాతోపాటు అన్ లిమిటెడ్ ఫోన్ కాల్స్, 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు.