న్యూఢిల్లీ, అక్టోబర్ 7 : టెలికాం వినియోగదారులకు భారతీ ఎయిర్టెల్ షాకిచ్చింది. పోస్ట్‌పెయిడ్ టారిఫ్‌లను రూ.50 వరకు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. దీంతోపాటు అంతర్జాతీయ రోమింగ్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ ఉచిత ఆఫర్‌ను అందిస్తున్నది.
ఈ నూతన ప్లాన్టు ఈ నెల 8 నుంచి అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది. మరోవైపు, రూ. 2 వేల విలువైన అంతర్జాతీయ ఉచిత రోమింగ్ ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపింది. దీంట్లోభాగంగా ఐదు రోజుల రోమింగ్ ప్యాక్ కింద 5జీబీ డాటా, 60 నిమిషాల పాటు ఉచితంగా కాలింగ్, 25 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చును.