‘ఎయిర్ ఇండియా వ్యాపారం కాదు.. బాధ్యత’
విమానయాన సంస్థ ఎయిర్ ఇండి యా అంటే కేవలం వ్యాపార అవకాశం మాత్రం కాదని, బాధ్యత కూడా అని టాటా గ్రూపు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. విమానయాన రంగం నిరంతరం సవాళ్లతో కూడుకున్న వ్యాపారమన్నారు.
- టాటా గ్రూపు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్
ముంబై, నవంబర్ 29 : విమానయాన సంస్థ ఎయిర్ ఇండి యా అంటే కేవలం వ్యాపార అవకాశం మాత్రం కాదని, బాధ్యత కూడా అని టాటా గ్రూపు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. విమానయాన రంగం నిరంతరం సవాళ్లతో కూడుకున్న వ్యాపారమన్నారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరాలో సమస్యలు, మౌలిక సదుపాయాలు, విమానాల లభ్యతలోనూ సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు.
విమానయానం వ్యాపారం చాలా మూలధన ఖర్చుతో కూడుకున్న బిజినెస్ అని, ఈ రంగంలో లాభాలు చాలా తక్కువగా ఉంటాయని జేఆర్డీ టాటా 121వ జయంతి ఉత్సావాల్లో ఆయన చెప్పారు. టాటా గ్రూపు…ఎయిర్ ఇండియాను కేవలం వ్యాపార దృక్ఫతంతో కొనుగోలు చేయలేదని, బాధ్యతతో తీసుకున్నదన్నారు. నష్టాల్లో నడుస్తున్న ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లను జనవరి 2022లో టాటా గ్రూపు దక్కించుకున్నది. భారత్ 8 శాతం వృద్ధిరేటును సాధిస్తే..విమానయాన రంగం రెండింతలు అధికంగా 16 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటుందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

