ITR filing | గడువు మిస్ అయినా.. ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు.. బట్ పెనాల్టీ పే చేయాలి.. 31 వరకూ ఐటీ శాఖ హెల్ప్ లైన్ డెస్క్‌లు
ITR Filing | గడువు మిస్ అయినా డిసెంబర్ 31 వరకూ బీలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. కానీ పెనాల్టీ ప్లస్ వడ్డీ పే చేయాలి. మరోవైపు సకాలంలో ఐటీఆర్ ఫైలింగ్ కోసం ఐటీ విభాగం 31 వరకు 24x7 గంటలపాటు హెల్ప్ లైన్ డెస్క్ నిర్వహిస్తున్నది.
ITR filing | గత ఆర్థిక సంవత్సరం 2022-23 (అంచనా సంవత్సరం 2023-24) ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఈ నెల 31తో గడువు ముగుస్తుంది. వేతన జీవులు.. వ్యక్తిగతంగా ఐటీ చెల్లింపుదారులు డెడ్ లైన్ దాటిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. అటువంటి ఐటీఆర్‌లను బీలేటెడ్ ఐటీఆర్స్ (belated ITRs) అంటారు. బీలేటెడ్ ఐటీఆర్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31 వరకు గడువు ఉంది. బీ లేటెడ్ ఐటీఆర్(belated ITR) దాఖలు చేసే వారు లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, సకాలంలో ఐటీఆర్ ఫైలింగ్ కోసం ఆదాయం పన్ను విభాగం ఈ నెల 31 వరకు 24×7 గంటలు హెల్ప్ లైన్ డెస్క్‌లు అందుబాటులోకి తెచ్చింది.
ఆదాయం పన్ను చట్టంలోని 234ఎఫ్ సెక్షన్ ప్రకారం బీలేటెడ్ ఐటీఆర్ (belated ITR) లు దాఖలు చేసేవారు రూ.5,000 లేట్ ఫీజు పే చేయాల్సి ఉంటది. రూ.5 లక్షల్లోపు ఆదాయం కల వారు మాత్రం రూ.1000 పెనాల్టీ చెల్లించాలి.
ఈ నెలాఖరులోగా ఐటీఆర్ ఫైల్ చేయడం మిస్ అయిన వారు చట్టంలోని 234ఏ,బీ,సీ సెక్షన్ల ప్రకారం పెనాల్టీతోపాటు దానిపై ఒకశాతం వడ్డీ పే చేయాలి. బీ లేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేసే వరకు అడ్వాన్స్ పన్ను చెల్లింపులో డిఫాల్ట్‌పై వడ్డీ చెల్లించాలి. కానీ, బీలేటెడ్ ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత టాక్స్ రీఫండ్ పై మాత్రం వడ్డీ చెల్లించరు.
31 వరకూ 24×7 గంటల సాయం
ఇప్పటి వరకూ గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఐటీఆర్ దాఖలు చేయని వారు త్వరితగతిన ఫైల్ చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అభ్యర్థించింది. ఇందుకోసం ఈ నెల 31 వరకు హెల్ప్‌లైన్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
‘ఐటీఆర్ ఫైలింగ్, పన్ను చెల్లింపు, సంబంధిత సేవల కోసం పన్ను చెల్లింపుదారులకు సాయం చేయడానికి మా హెల్ప్ డెస్క్ 24×7 గంటలు పని చేస్తుంది. ఈ నెల 31 వరకు కాల్స్, లైవ్ చాట్లు, వెబెక్స్ సెషన్స్, సోషల్ మీడియా వేదికల ద్వారా చేయూతనిస్తుంది’ అని ఐటీ అధికారి ఒకరు ట్వీట్ చేశారు.
ఐటీఆర్ ఫైలింగ్ కోసం ఐటీ విభాగం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..
1800 103 0025
1800 419 0025
+91-80-46122000
+91-80-61464700
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

