RBI | అన్సెక్యూర్డ్ లోన్లపై చర్యలుండాల్సిందే: ఆర్బీఐ
సంక్షోభాన్ని ముందే పసిగట్టి, దాన్ని అడ్డుకోవడానికి కృషి చేస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ క్రమంలోనే అన్సెక్యూర్డ్ రుణాలపై ఆర్బీఐ చర్యలు తీసుకోకపోతే అవి పెద్ద సమస్యల్నే సృష్టిస్తాయని హెచ్చరించారు.
RBI | ముంబై, జూన్ 20: సంక్షోభాన్ని ముందే పసిగట్టి, దాన్ని అడ్డుకోవడానికి కృషి చేస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ క్రమంలోనే అన్సెక్యూర్డ్ రుణాలపై ఆర్బీఐ చర్యలు తీసుకోకపోతే అవి పెద్ద సమస్యల్నే సృష్టిస్తాయని హెచ్చరించారు. గురువారం ఇక్కడి ఆర్బీఐ కాలేజ్ ఆఫ్ సూపర్‌వైజర్స్‌లో ఆర్థిక స్థితిస్థాపకతపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో దాస్ మాట్లాడారు. గత ఏడాది నవంబర్‌లో తీసుకున్న చర్య.. అన్సెక్యూర్డ్ రుణాలతో రిస్క్‌ను అడ్డుకున్నదని గుర్తుచేశారు. ఆర్బీఐ తీసుకున్న చర్యలతోనే క్రెడిట్ కార్డు పోర్ట్‌ఫోలియోల్లో వృద్ధి 30 శాతం నుంచి 23 శాతానికి తగ్గిందన్నారు. అలాగే బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల్లో రిస్క్‌తో కూడుకున్న రుణాలు 29 శాతం నుంచి 18 శాతానికి దిగొచ్చిందని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

