Adani Group | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: అబుదాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ).. తాము పెట్టుబడులు పెట్టిన రెండు అదానీ గ్రూప్ సంస్థలకు గుడ్‌బై చెప్తున్నది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్‌లలో తమకున్న వాటాలను అమ్మేయాలని ఐహెచ్సీ నిర్ణయించింది.
ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఉపసంహరణకు సంబంధించి ఓ బయ్యర్‌తో ఒప్పందం కూడా కుదిరినట్టు ఐహెచ్సీ తెలిపింది. కానీ ఆ వాటాలను కొంటున్నదెవరు? ఎంతకు అమ్ముతున్నారు? అన్న వివరాలు మాత్రం తెలియపర్చలేదు. గత ఏడాది ఏప్రిల్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీలో 500 మిలియన్ డాలర్లు, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఐహెచ్సీ పెట్టిన విషయం తెలిసిందే.