హైదరాబాద్, అక్టోబర్ 13: దేశంలో అతిపెద్ద బస్ బుకింగ్ యాప్ అభిబస్..ప్రస్తుత పండుగ సీజన్లో ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 19 నుంచి 25 లోపు ప్రయాణించేవారికి రూపాయికే బసు టికెట్టును బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం కూపన్ కోడ్ ‘LUCKY1’ని వినియోగించుకొని బసు టికెటు బుకింగ్ చేసుకున్నవారికి వర్తించనున్నదని తెలిపింది.