Personal Loans | వ్యక్తిగత రుణాలతో జాగ్రత్త.. బ్యాంక్‌లను హెచ్చరించిన ఆర్బీఐ గవర్నర్
RBI | బ్యాంకింగ్ వ్యవస్థలో రిటైల్ అన్సెక్యూర్డ్ లోన్స్ (వ్యక్తిగత రుణాలు) శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటి ద్వారా ఆర్థిక స్థిరత్వం రిస్క్‌లో పడుతుందన్న ఆందోళనను ఆర్బీఐ వ్యక్తం చేసింది.
Personal Loans | ముంబై, అక్టోబర్ 6: బ్యాంకింగ్ వ్యవస్థలో రిటైల్ అన్సెక్యూర్డ్ లోన్స్ (వ్యక్తిగత రుణాలు) శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటి ద్వారా ఆర్థిక స్థిరత్వం రిస్క్‌లో పడుతుందన్న ఆందోళనను ఆర్బీఐ వ్యక్తం చేసింది. పరపతి విధాన ప్రకటన సందర్భంగా గవర్నర్ దాస్ మాట్లాడుతూ పర్సనల్ లోన్స్‌తో ప్రస్తుతానికి ఎటువంటి సమస్యా లేదని, భవిష్యత్ రిస్క్‌ల పట్ల బ్యాంకర్లు జాగురూకతతో వ్యవహరించాలనే లక్ష్యంతోనే తాము హెచ్చరిస్తున్నామన్నారు.
‘మీరు జాగ్రత్తగా ఉండాలంటూ వారిని (రుణదాతలు) మేము కేవలం అప్రమత్తం చేస్తున్నాం. మీ కళ్లు, చెవులు తెరిచి ఉంచడమే కాదు. ముక్కు కూడా తెరవాలి. సంక్షోభం ఎక్కడ్నుంచి వస్తుందో వాసన పసిగట్టేందుకు’ అని దాస్ సూచించారు. ఏదైనా బ్యాంక్‌లో సమస్య ఏర్పడితే ఆర్బీఐ సూపర్వైజర్లు నేరుగా అటువంటి ఆర్థిక సంస్థను పర్యవేక్షిస్తారన్నారు. ప్రస్తుతానికి బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు స్థిరంగా ఉన్నాయని, జూన్ త్రైమాసికంలో స్థూల ఎన్పీఏల నిష్పత్తి మెరుగుపడిందన్నారు.
డిజిటలైజేషన్‌తో భారీ రిటైల్ రుణ వృద్ధి
డిజిటల్ సాధనాల ద్వారా రుణాలివ్వడమే పలు బ్యాంక్‌ల అన్సెక్యూర్డ్ రుణాలు విపరీతంగా పెరగడానికి కారణమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ చెప్పారు. గవర్నర్ దాస్ వ్యాఖ్యలు కేవలం సూచనలు మాత్రమేనని, ఆర్బీఐ ప్రస్తుతానికి ఎటువంటి స్థూల నియంత్రణా చర్యలేవీ ప్రకటించడం లేదన్నారు. తొలి రక్షణగా బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు, ఫిన్‌టెక్‌లు తగినరీతిలో అంతర్గత నియంత్రణలు చేపట్టాని స్వామినాథన్ సూచించారు. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు వంటి అన్సెక్యూర్డ్ లోన్స్ బాగా పెరిగిపోతున్నాయని, గత రెండేండ్లలో మొత్తం రుణ వృద్ధి 12-14 శాతం ఉండగా, అన్సెక్యూర్డ్ రుణాలు 23 శాతం వృద్ధిచెందాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారించేకంటే ముందుగానే అంతర్గత పర్యవేక్షణా యంత్రాంగాన్ని పటిష్ఠపర్చుకోవాలని ఆర్థిక సంస్థలకు సూచించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

