కేంద్ర ఖజానాకు 60,000 కోట్లు
నిధులు లేక సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వానికి శుభవార్త ఇది. ఈ ఏడాది ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) కేంద్రానికి భారీ డివిడెండ్లను చెల్లిస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బడ్జెట్లో నిర్దేశించిన అంచనాల్ని మించి చెల్లింపు ఉంటుందని పేర్కొన్నాయి.
- పీఎస్‌యూల నుంచి భారీ డివిడెండ్లు
న్యూఢిల్లీ, జనవరి 5: నిధులు లేక సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వానికి శుభవార్త ఇది. ఈ ఏడాది ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) కేంద్రానికి భారీ డివిడెండ్లను చెల్లిస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బడ్జెట్లో నిర్దేశించిన అంచనాల్ని మించి చెల్లింపు ఉంటుందని పేర్కొన్నాయి. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూల నుంచి రూ.55,000 కోట్ల నుంచి రూ. 60,000 కోట్ల వరకూ డివిడెండ్లు వస్తాయని ఆ వర్గాలు వివరించాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రూ.43,000 కోట్ల డివిడెండ్ మొత్తాన్ని బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యానికి మించి ఈ ఏడాది అదనంగా రూ.12,000-17,000 కోట్లు వస్తాయని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే పీఎస్‌యూల నుంచి రూ. 43,800 కోట్ల డివిడెండు మొత్తం కేంద్రానికి అందింది. పీఎస్‌యూల డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా వచ్చే నిధుల్లో భారీగా తగ్గనున్న నేపథ్యంలో ఆ లోటును డివిడెండ్లు పూడుస్తాయని భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యంలో కోత
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ సంస్థల వాటాల విక్రయిం ద్వారా కేంద్రానికి ఒనగూడే మొత్తంలో భారీ కోత పడనుంది. డిజిన్వెస్ట్‌మెంట్‌తో రూ. 51,000 కోట్లు సమీకరించాలని బడ్జెట్లో నిర్దేశించుకోగా, 30,000 కోట్లు కూడా రావడం కష్ఠమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ వాటాల విక్రయంతో రూ.10,500 కోట్లు మాత్రమే కేంద్రం సమీకరించగలిగింది. ప్రస్తుతం 8 ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయ ప్రతిపాదన వివిధ దశల్లో ఉన్నది. అవి..ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్, ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియా, ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్,ఫెర్రో స్క్రాప్ నిగమ్‌లు. వీటి వాటా విక్రయానికి ఇంకా సమయం పడుతుందని అంచనా. మరో పీఎస్‌యూ కంటైనర్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం ఇప్పటివరకూ ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్‌ను సైతం ఆహ్వానించలేదు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను పున: ప్రారంభించాలన్న ఉద్దేశ్యం కూడా ప్రభుత్వానికి లేదు. 2024-25లో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్), ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్ లిమిటెడ్‌ల డిజిన్వెస్ట్‌మెంట్ జరగవచ్చని అంచనా వేస్తున్నట్టు సంబంధిత వర్గాలు వివరించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

