5G | తొలి దశలో హైదరాబాద్ సహా 13 నగరాల్లో 5జీ సేవలు!
దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించేందుకు ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడఫోన్ ఐడియా వంటి టెలికాం ఆపరేటర్లు కసరత్తు సాగిస్తున్నారు.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించేందుకు ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడఫోన్ ఐడియా వంటి టెలికాం ఆపరేటర్లు కసరత్తు సాగిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ప్రతి ఒక్కరికీ 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఇప్పటికే ప్రకటించారు. సెప్టెంబర్ 29న జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 5జీ నెట్‌వర్క్‌ను అధికారికంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది.
అక్టోబర్‌లో 5జీ సేవలు ప్రారంభమవుతాయని మంత్రి అశ్వని వైష్ణవ్ ఇప్పటికే ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 5జీ స్ప్రెక్టం వేలాన్ని పూర్తి చేసి ఆ ప్రక్రియ ఆమోదం, స్పెక్ట్రం కేటాయింపులను చేపడుతోంది. భారత్‌లో 5జీ స్ప్రెక్టం వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ 1.5 లక్షల కోట్లు సమకూరతాయని అంచనా. వేలంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వీఐతో పాటు అదానీ డేటా నెట్వర్క్ కూడా పాల్గొంది.
ఇక తొలి దశలో భాగంగా హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూర్, చండీఘఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రాం, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణే నగరాల్లో 5జీ సేవలు ప్రారంభం కానుండగా దశలవారీగా దేశమంతటా 5జీ నెట్వర్క్ విస్తరిస్తుంది. భారత్‌లో 4జీ ప్లాన్ల తరహాలోనే 5జీ ప్లాన్లు కూడా అందుబాటు ధరల్లో లభిస్తాయి. 5జీ విస్తరణకు ఊతమిచ్చేలా 4జీ సేవల టారిఫ్ ప్లాన్లనే 5జీకి టెలికాం ఆపరేటర్లు వర్తింపచేయవచ్చని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- 5G
- airtel
- First phase
- Reliance Jio
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

