Valentines Day Week : వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ వారంలో భారత్‌లో నిమిషానికి 350 గులాబీలు, 406 చాక్లెట్లను యువ జంటలు ఆర్డర్ చేశాయి. ఆన్లైన్ ప్లాట్‌ఫాంపై గులాబీలు, చాక్లెట్స్, రొమాంటిక్ గిఫ్ట్‌ల ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే జరుపుకుంటున్నా వారం రోజుల ముందు నుంచే భారత్‌లో సెలబ్రేషన్స్ ఊపందుకున్నాయి.
ఈ-కామర్స్ వేదికలు, డేటింగ్ సైట్స్ భారీ క్యాంపెయిన్‌తో రొమాంటిక్ ప్రోడక్ట్స్, గిఫ్ట్‌ల సేల్స్‌ను ప్రోత్సహించాయి. దీంతో రికార్డ్ బ్రేకింగ్ ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ వారంలో నిమిషానికి 350 రోజెస్, 406 చాక్లెట్స్ వినియోగదారులు కొనుగోలు చేశారు. ఫిబ్రవరి 9న తాము నిమిషానికి 406 చాక్లెట్స్ డెలివరీ చేశామని ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం బ్లింకిట్ సీఈవో అల్బిందర్ థిండ్సా ట్వీట్ చేశారు.
మరో 20,000కిపైగా చాక్లెట్స్, చాక్లెట్ బాక్స్‌లు మరో పది నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ అవుతాయని తెలిపారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఆన్లైన్ కేక్ ఆర్డర్స్ కూడా ప్రతి నిమిషానికీ పెరుగుతున్నాయని స్విగ్గీ సీఈవో రోహిత్ కపూర్ ట్వీట్ చేశారు.
Read More :
Valentines Day | జైలు గదుల్లో డిన్నర్ ఏర్పాట్లు : జంటలకు వెయ్యేండ్ల నాటి బ్రిటన్ జైలు ఆతిధ్యం