Valentines Day : వాలెంటైన్స్ డే సందర్భంగా బ్రిటన్‌లోని ఓ పురాతన జైలు జంటలకు వినూత్న డైనింగ్ అనుభవం కల్పించింది. జంటలు దాదాపు రూ. 17,000 చెల్లించి జైలు గదుల్లో డిన్నర్ చేయవచ్చని ఆఫర్ చేసింది. వెయ్యేండ్ల నాటి ఆక్స్ఫర్డ్ జైలు ఫిబ్రవరి 14న సాధారణ జైలు భోజనానికి బదులుగా స్పెషల్ మెనూ ఆఫర్ చేస్తోంది.
హత్యారోపణలు ఎదుర్కొంటున్న నేరగాళ్లు ఉండే సెల్స్‌లో సైతం అతిధులు విందు ఆరగించే అవకాశాన్ని కూడా జైలు అధికారులు కల్పిస్తున్నారు. తమ చారిత్రక భవనంలోని ఆరు వినూత్న లొకేషన్స్‌లో వాలెంటైన్స్ డే సందర్భంగా జైలు గదుల్లో విందు ఆరగించాలని ఆక్స్ఫర్డ్ క్యాజిల్ అండ్ ప్రిజన్ తమ వెబ్సైట్లో రాసుకొచ్చింది.
సెల్ బ్లాక్స్‌లో క్యాండిల్స్, ఫ్లవర్స్‌తో ముస్తాబు చేసిన యాంబియెన్స్లో అతిధులు త్రీ కోర్స్ మీల్‌ను ఎంజాయ్ చేయవచ్చు. నోరూరించే స్టార్టర్స్, మెయిన్ మెనూతో పాటు వైట్ వైన్, ప్రాసెక్కో బాటిల్‌ను కూడా ప్యాకేజ్‌లో భాగంగా గెస్ట్‌లకు ఆఫర్ చేస్తారు.
Read More :