చెన్నై, నవంబర్ 29: అపాచీలో సరికొత్త మోడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది టీవీఎస్ మోటర్. 2023 ప్రత్యేక ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ మోటర్‌సైకిల్ 160 4వీ ఆర్టీఆర్ మోడల్ ధరను రూ.1.30 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 159.7 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో రూపొందించిన ఈ మోడల్లో ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, ఐదు గేర్లు ఉన్నాయి.