2023 Honda Dio 125 | మార్కెట్లోకి 2023 హోండా డియో 125 .. స్పెషలైజ్డ్ ఫీచర్లు ఇలా.. ధరెంతంటే?!
2023 Honda Dio 125 | హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా దేశీయ మార్కెట్లోకి హోండా డియో 125 స్కూటర్ ఆవిష్కరించింది.
2023 Honda Dio 125 | హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) దేశీయ మార్కెట్లోకి న్యూ డియో125 (Honda Dio 125) స్కూటర్ ఆవిష్కరించింది. ఈ స్కూటర్ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.83,400 (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించారు. హోండా యాక్టీవా 125, హోండా గ్రాజియా తర్వాత 125సీసీ ఇంజిన్‌తో వస్తున్న మూడో స్కూటర్ ఇది. ఈ స్కూటర్‌కి 10 ఏండ్ల వారంటీ ఉంది. ఇందులో మూడేండ్లు స్టాండర్ట్, ఏడేండ్లు ఆప్షనల్ వారంటీ ఇస్తారు. స్టాండర్డ్ వేరియంట్ స్కూటర్ రూ.83,400 (ఎక్స్ షోరూమ్), స్మార్ట్ వేరియంట్ రూ.91,300 (ఎక్స్ షోరూమ్)లకు లభిస్తాయి.
హోండా డియో 125 స్కూటర్ ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. పెరల్ సిరెన్ బ్లూ, పెరల్ నైట్ స్టార్ బ్లాక్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, పెరల్ డీప్ గ్రౌండ్ గ్రే, మ్యాట్ ఆక్సిస్ గ్రే మెటాలిక్, స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ సంగ్రీరా రెడ్ మెటాలిక్ రంగుల్లో సొంతం చేసుకోవచ్చు.
ఎడ్జ్ లుకింగ్ హెడ్ ల్యాంప్, డ్యుయల్ ఔట్ లెట్ మఫ్లసర్ విత్ క్రోమ్ కవర్ ఫీచర్ ఉంటుంది. స్పోర్టీ ఎగ్జాస్ట్ నోట్, న్యూ స్ప్లిట్ గ్రాబ్ రైల్, 12-అంగుళాల అల్లాయ్ వీల్స్, న్యూ గ్రాఫిక్స్, వేవ్ డిస్క్ బ్రేక్ ఫీచర్లు జత చేశారు.
స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ అన్ లాక్, స్మార్ట్ స్టార్ తదితర ఫీచర్లతో కూడిన హోండా స్మార్ట్ కీతో వస్తున్నదీ స్కూటర్. చోరీలను నివారించేందుకు ఈసీయూ, స్మార్ట్ కీ మధ్య ఎలక్ట్రానిక్ మ్యాచింగ్ గల ఐడీతో కూడి స్మార్ట్ కీ వస్తారు. ఇది ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ డివైజ్ గా పని చేస్తుంది. ఫిజికల్ కీ ఉపయోగించకుండా లాక్ హ్యాండిల్, ఇగ్నిషన్ ఆఫ్, ఫ్యుయల్ లిడ్ ఓపెన్, సీట్ ఓపెన్ అండ్ ఇగ్నిషన్ ఆన్ ఆప్షన్ గల స్మార్ట్ కీ ఇది.
ఇంకా ట్రిప్, క్లాక్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, స్మార్ట్ కీ అండ్ బ్యాటరీ ఇండికేటర్, ఎకో ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్ తదితర ఫీచర్లు కూడా జత చేశారు. ఫ్రంట్ పాకెట్, ఇంటిగ్రేటెడ్ హెడ్ ల్యాంప్ బీమ్, పాసింగ్ స్విచ్ తోపాటు హోండా డియో 125 18 లీటర్ల స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

