Audi Q3 Sportback | దేశీయ మార్కెట్లో ఆడీ క్యూ3 స్పోర్ట్ బ్యాక్.. 7.3 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్
Audi Q3 Sportback | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా.. దేశీయ మార్కెట్లోకి క్యూ3 స్పోర్ట్ బ్యాక్ తీసుకొచ్చింది. దీని ధర రూ.51.43 లక్షలుగా నిర్ణయించింది. 7.3 సెకన్లలో 100 కి.మీ. వేగంతో దూసుకెళుతుంది
Audi Q3 Sportback | లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా.. దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ లెవెల్ `కూపె ఎస్యూవీ క్యూ3 స్పోర్ట్ బ్యాక్ (coupe SUV Q3 Sportback)` కారును తీసుకొచ్చింది. ఇది కేవలం 7.3 సెకన్లలో 100 కి.మీ. వేగంతో దూసుకెళ్లగలుగుతుంది. న్యూ ఆడీ క్యూ3 కారు ధర రూ.51.43 లక్షలుగా నిర్ణయించింది. ఈ కారుపై ఆసక్తి గల వారు రూ.2 లక్షలు చెల్లించి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.
ఆల్ న్యూ 2023 ఆడి క్యూ3 స్పోర్ట్ బ్యాక్ కారు.. టర్బో బ్లూ, గ్లాసియర్ వైట్, చ్రోనోస్ గ్రే, మైథోస్ బ్లాక్, నవరత్న బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. సింగిల్ ఫుల్లీ-లోడెడ్ టెక్నాలజీ +ఎస్ లైన్ ట్రిమ్‌తో ఆఫర్ చేస్తున్నది. గతేడాది ఆగస్టులో రెండు వేరియంట్లలో క్యూ3 కార్లను ఆవిష్కరించింది. క్యూ3 ప్రీమియం ప్లస్ వేరియంట్ కారు రూ.44.89 లక్షలు, టెక్నాలజీ వేరియంట్ కారు ధర రూ.50.39 లక్షలు పలికింది.
ఆడీ క్యూ3 కార్ల ధరలు ఇలా
క్యూ3 ప్రీమియం ప్లస్ – రూ.44.89 లక్షలు.
క్యూ3 టెక్నాలజీ – రూ.50.39 లక్షలు
క్యూ3 స్పోర్ట్ బ్యాక్ టెక్నాలజీ + ఎస్ లైన్ – రూ. 51.43 లక్షలు.
ఇంజిన్ స్పెషిఫికేషన్లు..
సెకండ్ జనరేషన్ ఆడి క్యూ3 అన్ని వేరియంట్ కార్లలో 2.0-లీటర్ల టీఎఫ్ఎస్ఐ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటార్ ఇంజిన్ ఉంటుంది. ఇది 190 బీహెచ్పీ విద్యుత్, 320 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది. ఫోక్స్ వ్యాగన్ టైగూన్, స్కోడా కుషాక్ కార్లలోనూ ఈ ఇంజిన్ ఏర్పాటు చేశారు. కేవలం 7.3 సెకన్లలో 100 కి.మీ. స్పీడ్ అందుకోగలుగుతుంది.
ఇవీ ఫీచర్లు
- స్టాండర్డ్ క్యూ3 ఎస్‌యూవీపై ఆధారపడి రూపుదిద్దుకున్న న్యూ ఆడి క్యూ3 స్పోర్ట్ బ్యాక్ కారు.
- ఎస్యూవీ కూపె లుక్ కోసం స్లోపింగ్ రూఫ్‌లైన్.
- ఫ్రంట్‌లో ఓక్టాగొన్ షేప్డ్ గ్రిల్లె, మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్.
- 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్.
- 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్.
- 360-డిగ్రీస్ పార్కింగ్ కెమెరా.
- 10-స్పీకర్ సౌండ్ సిస్టమ్.
- ప్రయాణికుల సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

