Yamaha MT15 2.0 | ఎంటీ15వీ 2.0 బైక్ లాంచ్ చేసిన యమహా.. రూ.1.6 లక్షల నుంచి షురూ!
Yamaha MT15 2.0 | డ్యూక్ 125 బైక్‌కు పోటీగా ప్రముఖ టూ వీలర్స్ సంస్థ యమహా.. ఎంటీ15వీ 2.0 మోటారు సైకిల్‌ను ఆవిష్కరించింది.
Yamaha MT15 2.0 | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యమహా.. దేశీయ మార్కెట్లోకి నూతన తరం ఎంటీ15వీ 2.0 బైక్ ఆవిష్కరించింది. ఆర్15వీ బైక్ మోడల్ బేస్‌గా రూపుదిద్దుకున్న ఎంటీ 15వీ 2.0 మోటారు సైకిల్ సరికొత్త అందాలతో వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నది. నాలుగు రకాల ఆప్షన్లలో ఇది లభించనున్నది. 2022 మోడల్ ఎంటీ15 వీ 2.0 బైక్ సియాన్ స్టార్మ్, రేసింగ్ బ్లూ, ఐస్ ఫ్లూ వెర్మిలియన్, మెటాలిక్ బ్లాక్ వేరియంట్లలో అందుబాటులోకి వస్తున్నది. డ్యూక్ 125 మోటారు సైకిల్‌తో పోటీ పడనున్న ఎంటీ 15వీ 2.0 బైక్ రూ.1.6 లక్షల నుంచి కొనుగోలు చేయొచ్చు.
సింగిల్ చానెల్ ఏబీఎస్‌కు బదులు డ్యూయల్ చానెల్ ఏబీఎస్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన న్యూ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సింగిల్ ప్యాడ్ ప్రొజెక్టర్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, రైజ్డ్ టెయిల్ సెక్షన్, సైడ్ స్లంగ్ ఆఫ్ స్వెఫ్ట్ ఎగ్జాస్ట్ మఫ్లర్స్ తదితర ఫీచర్లు ఆకర్షణ కానున్నాయి. న్యూ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, సైడ్ స్టాండ్ ఇంజిన్ ఇన్హిబిటర్, రెగ్యులర్ క్విక్ షిఫ్టర్ కూడా ఏర్పాటు చేశారు.
ఇది వీవీఏ టెక్నాలజీతో కూడిన 155 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్‌కూల్డ్ ఇంజిన్‌తో రూపుదిద్దుకున్నది. పది వేల ఆర్పీఎం వద్ద 18.4 పీఎస్ పవర్, 7,500 ఆర్పీఎం వద్ద 14.1 ఎన్ఎం గరిష్ట టార్చ్ విడుదల చేస్తుంది. స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్ కూడా జత చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

