జకార్తా : వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న 2022 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ స్కెచ్లను కంపెనీ ఇండోనేషియా విభాగం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో ఒకటిగా నిలిచిన హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2022 చివరిలో భారత్ మార్కెట్లోకి రానుంది.
లేటెస్ట్ ఫీచర్లతో 2022 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను డిజైన్ చేస్తున్నట్టు తాజా స్కెచెస్లో వెల్లడైంది. దీటైన బాడీ, న్యూ డిజైన్లతో పాటు ప్రీమియం, కాంటెపరరీ టచ్‌తో న్యూ క్రెటా కస్టమర్ల ముందుకు రానుంది. స్పోర్టీ లుక్‌ను తీసుకువచ్చేలా డీ కట్ స్టీరింగ్ వీల్‌తో పాటు త్రీడీ ప్యాటర్న్డ్ గ్రిల్ వంటి వినూత్న ఫీచర్లతో న్యూ క్రెటా ముస్తాబవుతోంది.