న్యూఢిల్లీ : భారత్‌లో అప్రిలియా న్యూ ఎస్ఆర్ 160, ఎస్ఆర్ 125ను పియాజియా లాంఛ్ చేసింది. డిజైన్ సహా పలు ఫీచర్లను అప్డేట్ చేయడంతో పాటు నూతన శ్రేణి వాహనాలు బీఎస్6 ప్రమాణాలతో కస్టమర్ల ముందుకు వచ్చాయి. ఇక 2012 అప్రిలియా ఎస్ఆర్ 160 ధర రూ 1,07,595 కాగా, ఎస్ఆర్ 125 ధర రూ 1,17,494 (ఎక్స్‌షోరూం, ఇండియా). రూ 5000 టోకెన్ అమౌంట్‌తో న్యూ ఎస్ఆర్ రేంజ్ బైక్‌లను బుక్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.