Rice ban impact | కేంద్రం నిర్ణయంతో ఓడ రేవుల్లో పేరుకుపోయిన 2 లక్షల టన్నుల బియ్యం.. ఇప్పుడు వాటి పరిస్థితేంటి?
Rice ban impact | కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని విధించడంతో దేశంలోని పలు ఓడరేవుల్లో బియ్యం కంటైనర్లు పేరుకుపోయాయి. జూలై 20 సాయంత్రం నాన్-బాస్మతి బియ్యం ఎగుమతులపై నియంత్రణలు ప్రకటిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటిఫికేషన్ జారీచేసింది.
Rice ban impact | న్యూఢిల్లీ, ఆగస్టు 3: కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని విధించడంతో దేశంలోని పలు ఓడరేవుల్లో బియ్యం కంటైనర్లు పేరుకుపోయాయి. జూలై 20 సాయంత్రం నాన్-బాస్మతి బియ్యం ఎగుమతులపై నియంత్రణలు ప్రకటిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటిఫికేషన్ జారీచేసింది.
ఎగుమతులు నిలిచిపోవడంతో ఇప్పటికీ రేవుల వద్ద 2,00,000 టన్నుల బియ్యం నిల్వలు పడిఉన్నాయి. నోటిఫికేషన్ ఇచ్చేనాటికి షిప్ల్లో లోడింగ్ మొదలైన బియ్యం ఎగుమతులనే అనుమతించారు. నోటీఫై అయినతర్వాత పలు రేవుల వద్ద ఉన్న బియ్యం నిల్వలకు కస్టమ్స్ క్లియరెన్స్ లభించలేదు. దీంతో వీటి ఎగుమతులు నిలిచిపోయాయని వ్యాపారులు చెప్పారు. ఇలా నిలిచిపోయిన కార్గోలు 1,50,000 నుంచి 2,00,00 టన్నుల వరకూ ఉంటాయని తెలిపారు.
ప్రత్యేక అనుమతి లభిస్తే ఎగుమతి
అత్యవసరమైన దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రత్యేక అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నిల్వల్ని రేవుల వద్దే వ్యాపారులు అట్టిపెట్టినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో భారత్ నుంచే బియ్యం అధికంగా ఎగుమతులు జరుగుతుంటాయి. బియ్యం అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ వాటా 45 శాతం. నెలకు భారత్ నుంచి 18 లక్షల టన్నుల వరకూ బియ్యం ఎగుమతి అవుతాయి. అందులో నాన్-బాస్మతి బియ్యం 10 లక్షల నుంచి 12 లక్షల టన్నుల వరకూ ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- rice
- rice ban
- rice stocks
- Traders
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

