రిలయన్స్@రూ.14 లక్షల కోట్లు

- హురున్ గ్లోబల్ టాప్-500 విలువైన సంస్థల జాబితాలో 12 భారతీయ కంపెనీలకు స్థానం
న్యూఢిల్లీ, ఆగస్టు 20: హురున్ గ్లోబల్ టాప్-500 విలువైన సంస్థల జాబితాలో ఈ ఏడాది 12 భారతీయ కంపెనీలకు చోటు దక్కింది. దేశీయంగా వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అగ్రస్థానంలో ఉండగా, 188 బిలియన్ డాలర్ల(రూ.14 లక్షల కోట్ల)తో మొత్తం జాబితాలో 57వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చితే కంపెనీ విలువ 11 శాతం పెరిగింది. ఇక ఆర్ఐఎల్ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 164 బిలియన్ డాలర్లతో ఉన్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 113 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో స్థిరపడింది. ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎయిర్టెల్, కొటక్ మహీంద్రా విలువ నిరుడుతో చూస్తే ఈసారి తగ్గుముఖం పట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్ విలువ 36 శాతం పెరిగింది. ఇదిలావుంటే జాబితాలో 12 సంస్థలతో భారత్.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి 9వ స్థానంలో నిలిచింది.
- తొలిసారిగా ఈ ఏడాదే జాబితాలోకి విప్రో, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్
- గతేడాది జాబితాలో 11 భారతీయ సంస్థలకే దక్కిన చోటు
- 12 కంపెనీల్లో ముంబైకి చెందినవే 8 ఉండ గా, బెంగళూరు 2, నోయిడా, ఢిల్లీల్లో ఒక్కోటి
- జాబితాలో అత్యధిక సంస్థలతో అమెరికాకు (243) అగ్రస్థానం
- తర్వాతి మూడు స్థానాల్లో చైనా (47), జపాన్ (30), బ్రిటన్ (24)
- జాబితాలోని 240 సంస్థలకు భారత్‌తో వ్యాపార సంబంధాలు
- అత్యధికంగా ముంబైలో 86, బెంగళూరులో 52, గురుగ్రామ్‌లో 32, న్యూఢిల్లీలో 30, పుణెలో 13
- జాబితాలో ఉన్న భారతీయ సంస్థల్లో 6 ఆర్థిక సేవలు, సాఫ్ట్వేర్, టెలీ కమ్యూనికేషన్స్‌కు చెందినవే
- ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా యాపిల్
- 15 శాతం వృద్ధితో 2.4 ట్రిలియన్ డాలర్లకు ఎగిసిన విలువ
- యాపిల్ తర్వాతి స్థానాల్లో మైక్రోసాఫ్ట్, అమెజాన్, అల్ఫాబెట్, ఫేస్బుక్, టెన్సెంట్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

