అదిరేటి గౌను మేమేస్తే..

ఫంక్షన్ అయినా, పార్టీ అయినా లాంగ్ ఫ్రాక్స్‌లో తళుక్కుమనడం నయా ట్రెండ్. అరకొర బట్టలేసుకున్నారనే అపవాదు ఉండదు. ముసలమ్మలా ముస్తాబయ్యారనే వెటకారం వినిపించదు. సంప్రదాయానికి సంప్రదాయం, ఫ్యాషన్‌కి ఫ్యాషన్!
గ్రాండ్ ైస్టెల్
దుస్తుల్లో పట్టు స్థానం ప్రత్యేకం. అందుకే, కొంచెం గ్రాండ్‌గా కనిపించాలనుకుంటే పట్టుతో డిజైన్ చేసిన ఈ హెవీ వర్క్ ఫ్రాక్ నిండుగా ఉంటుంది. వైన్ కలర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్‌పై లోటస్ మోటిఫ్‌తో చేసిన మగ్గం వర్క్ రిచ్ లుక్ ఇస్తున్నది. జార్జెట్ ఫ్యాబ్రిక్‌పై అక్కడక్కడా బుటిస్ ఇచ్చి, పది ఇంచులకు పైగా చేసిన టోటల్ సీక్వెన్స్ వర్క్ బాటమ్‌కి గ్రాండ్ లుక్ తీసుకొచ్చింది. చివర్లో ఇచ్చిన సన్నటి వెల్వెట్ లైన్ బోర్డర్‌ని హైలెట్ చేస్తున్నది. డిటాచబుల్ కాలర్ జువెలరీ ైస్టెల్లో చేసిన మగ్గం వర్క్ ట్రెడిషనల్‌గా కనిపిస్తున్నది. హాండ్స్ జార్జేట్ ఫ్యాబ్రిక్‌తో ఫాలింగ్‌లో పఫ్ పాటర్న్‌తో హ్యాండ్స్ ఇచ్చారు. యోక్‌కి ముందు సీక్వెన్స్‌తో డిజైన్ చేసిన బో ఈ ఫ్రాక్‌కి ప్రత్యేక ఆకర్షణ.

బాల్ ైస్టెల్
గుండ్రంగా ప్లఫ్పీగా బాల్ గౌన్ లుక్‌లో చేసిన డిజైన్ ఇది. టాప్‌లో పాట్ షేప్‌లో రిచ్‌లుక్ కోసం మగ్గం వర్క్ త్రెడ్స్‌తో రూపొందించిన ప్యాచ్ చేశారు. బాటమ్ మొత్తం మల్టీ కలర్ నెట్‌తో ఇచ్చిన ప్లీట్స్‌తో ట్రెండీలుక్ వచ్చింది. బాటమ్ గెరా పారెట్ గ్రీన్ నెట్ ఫ్యాబ్రిక్, పైన లేయర్ హాఫ్ సర్కిల్లో మల్టీ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చి ముత్యాల బార్డర్‌తో హైలైట్ చేశారు. యునీక్ ైస్టెల్లో మల్టీకలర్ నెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన బెలూన్ ైస్టెల్ హాండ్స్ డిఫరెంట్‌గా కనిపిస్తూ, అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి.

త్రీడీ ైస్టెల్
నల్లని నలుపుతో మహిళల మనసు దోచే గులాబీ రంగు కాంబినేషన్లో చేసిన డిజైన్ ఇది. త్రీడీ ైస్టెల్ ఉన్న బ్లాక్ కలర్ బాడీకి కాంబిరోజ్ ఫ్లవర్స్ జోడించారు. పింక్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్‌తో ఫుల్ బాటమ్ గేరా ఇచ్చారు. చివర్లో ఫ్లోరల్ అర్గంజా ఫ్యాబ్రిక్‌ను, గెరా మొత్తం రఫుల్స్ వైర్ పికో చేయడంతో క్లాసీ లుక్ వచ్చింది. హ్యాండ్స్‌కి వన్ సైడ్ పింక్ ఆర్గంజాతో పఫ్ ైస్టెల్ ఇచ్చి.. కాంట్రాస్ట్‌లో బ్లాక్ ఆర్గంజాతో చిన్న బో ఇచ్చారు. రైట్ సైడ్‌లో ప్యాచ్ చేసిన పింక్ అర్గంజా ఫ్యాబ్రిక్ రోజ్ ఫ్లవర్ డిఫరెంట్ లుక్ ఇస్తున్నది. లెఫ్ట్ సైడ్ హ్యాండ్‌కి యాడ్ చేసిన మెటల్ బ్రోచెర్ ట్రెండీగా కనిపిస్తున్నది.
రితేషా రెడ్డి,
ఇషా డిజైనర్ హౌస్,
follow us on:instagram.com
/riteshareddy,
7013639335
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

