Beauty tips | చర్మంపై నల్ల మచ్చలా.. ఈ టిప్స్‌తో చెక్‌పెట్టండి..!
Beauty tips | ప్రధానమైన చర్మ సమస్యల్లో బ్లాక్ హెడ్స్ (Black heads) సమస్య ఒకటి. బ్లాక్ హెడ్స్ అంటే చర్మంపై చిన్నసైజులో వచ్చే నల్లనల్లని కురుపుల్లాంటి మచ్చలు. ఇవి తొలగించినాకొద్ది పదేపదే వస్తుంటాయి. మృతకణాలు చర్మ రంధ్రాలను పూడ్చేయడం వల్ల ఈ బ్లాక్ హెడ్స్ సమస్య తలెత్తుతుంది.
Beauty tips : ప్రధానమైన చర్మ సమస్యల్లో బ్లాక్ హెడ్స్ (Black heads) సమస్య ఒకటి. బ్లాక్ హెడ్స్ అంటే చర్మంపై చిన్నసైజులో వచ్చే నల్లనల్లని కురుపుల్లాంటి మచ్చలు. ఇవి తొలగించినాకొద్ది పదేపదే వస్తుంటాయి. మృతకణాలు చర్మ రంధ్రాలను పూడ్చేయడం వల్ల ఈ బ్లాక్ హెడ్స్ సమస్య తలెత్తుతుంది. ముఖం, భుజాలు, బాహువులపై ముఖ్యంగా ముఖంలో ముక్కుపై, గదమపై ఈ బ్లాక్ హెడ్స్ కనిపిస్తాయి. కొన్ని సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. బ్లాక్ హెడ్స్‌ను పోగొట్టే ఆ చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
నీటి ఆవిరి
ఒక పాత్రలో నీళ్లను తీసుకుని వేడి చేయాలి. ఆ తర్వాత నీటి ద్వారా వచ్చే అవిరిపై టవల్‌ను పెట్టాలి. వెంటనే ఆ టవల్‌ను బ్లాక్‌హెడ్స్ ఎక్కువగా ఉన్న చోట సున్నితంగా రుద్దుకోవాలి. ఇలా రోజుకు మూడు సార్లు చేస్తే కొన్ని రోజుల్లోనే బ్లాక్ హెడ్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
పెరుగు, శనగపిండి, కాఫీ పొడి
చిక్కటి పెరుగు, శనగపిండి, కాఫీపొడి కలిపి పేస్ట్‌లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పై అప్లయ్ చేసి చేతులతో తేలికగా మసాజ్ చేసుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలపాటు మసాజ్ చేసి ఆ తర్వాత సాధారణ నీళ్లతో కడుక్కోవాలి. అనంతరం మాయిశ్చరైజర్ అప్లయ్ చేయడం మర్చిపోవద్దు. వారానికి రెండు సార్లు ఇలా మసాజ్ చేయడంవల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
గుడ్డు తెల్లసొన, బేకింగ్ సోడా
గుడ్డులోని తెల్లసొనలో రెండు టీ స్పూన్ల బేకింగ్ సోడా మిక్స్ చేసి బ్లాక్ హెడ్స్‌పై అప్లయ్ చేయాలి. అనంతరం 15 నుంచి 20 నిమిషాలు చేతులతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఈ ప్యాక్‌ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు వేసుకోవచ్చు. దీంతో నల్లమచ్చలు త్వరగా తగ్గిపోతాయి.
పుదీనా ఆకుల పేస్ట్
పుదీనా ఆకుల పేస్టును ఉపయోగించడం ద్వారా సులభంగా బ్లాక్ హెడ్స్‌ను దూరం చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా పుదీనా ఆకులు, చిటికెడు పసుపును నీటిలో వేసి మరిగించాలి. ఆకులను మెత్తగా చేసి బ్లాక్ హెడ్స్‌పై పట్టించి కాసేపు అలాగే వదిలేయాలి. అనంతరం చేతులతో సుతిమెత్తగా మసాజ్ చేయాలి. ఇప్పుడు గోరువెచ్చని లేదా సాధారణ నీటితో కడుక్కోవాలి.
గమనిక : పై వాటిలో మీకు నచ్చిన చిట్కాను పాటించి సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఏకకాలంలో అన్ని చిట్కాలను ప్రయత్నించకుండా ఒక చిట్కా పనిచేయకపోతే తర్వాత మరో చిట్కాకు మారండి.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
Vakiti Srihari | తాగేందుకు, వంటకూ రూ.20 ఫిల్టర్ డబ్బా నీళ్లే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో నీటి కష్టాలపై మహిళ.. వీడియో
RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు క్రాకర్స్‌తో గాలి శుభ్రమయ్యేది: ఆర్ఎస్ఎస్ చీఫ్
భోజనం చేద్దామన్నఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. ధాన్యం కొంటే చాలు..! నేనే 10 మందికి పెడతానని రైతు సమాధానం : వీడియో
Suriya | కోలీవుడ్‌లో సూర్య సరికొత్త చరిత్ర.. మూడు సినిమాలతో రూ.800 కోట్ల మైలురాయి!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

