YV Subbareddy | సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్ రాకపై క్లారిటీ ఇచ్చిన వైవీ
YV Subbareddy | విజయవాడలోని ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి(CM Jagan) క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్( Container ) రాకపై వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు.
అమరావతి : విజయవాడలోని ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి(CM Jagan) క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్( Container ) రాకపై వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) చేస్తున్న ఆరోపణలను ఖండించారు. మంగళవారం ఓ కంటైనర్ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చింది. కంటైనర్‌లో ఏముందంటూ నారా లోకేష్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకే డబ్బులను తరలిస్తున్నారని ఆరోపించారు.
కంటైనర్‌లో వచ్చింది బ్రెజిల్ సరుకా? మద్యంలో మెక్కిన వేలకోట్లా, లండన్ పరారీకి ఏర్పాట్లా ? ఏపీ సెక్రటేరియట్ దాచిన దొంగ ఫైళ్లా? అంటూ చేసిన ఆరోపణలపై వైవీ స్పందించారు. చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని, టీడీపీ(TDP) నాయకులకు ఏ కంటైనర్ చూసినా డ్రగ్స్ కంటైనరే గుర్తొస్తుందని విమర్శించారు.
విశాఖ నదీతీరంలో పట్టుబడ్డ డ్రగ్స్ (Drugs) కేసులో టీడీపీ నేతల బంధువులే ఉన్నారని పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో ఉండే ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నిచర్‌ను తీసుకెళ్లారని వెల్లడించారు. లోకేష్ చట్ట సభలకు ఎన్నికైన వ్యక్తి కాదని దొడ్డిదారిన మంత్రి అయి అవగాహన లేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

