YS Sharmila | అందుకే కదా మీకు పట్టం కట్టింది .. కూటమి ప్రభుత్వంపై షర్మిల ఆగ్రహం
YS Sharmila | ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.
అమరావతి: ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతు పక్షపాతిగా ఉంటామని హామి ఇచ్చి నేడు పట్టించుకోవడం లేదంటూ ట్విట్టర్ ఎక్స్ వేదిక ద్వారా ఆరోపించారు. ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడి (Achchennaidu) కి రైతుల బాధలు కనిపించడం లేదని విమర్శించారు.
పల్నాడు జిల్లా (Palnadu District) లో విత్తనాల కోసం రాత్రివేళల్లో క్యూలైన్లో నిలబెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సాగర్ కుడికాలువ కింద రైతులకు విత్తన కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. కుండపోత వర్షంలోనూ మహిళలు విత్తనాల కోసం ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
గత వైసీసీ ప్రభుత్వం రైతాంగ శ్రేయస్సు కోసం పనిచేయక పోవడం వల్లే రైతులు కూటమికి పట్టం కట్టారని, మాజీ సీఎం జగన్ నిండా ముంచారు అనే కదా 11 సీట్లకు పరిమితం చేశారని గుర్తు చేశారు. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. రైతులను వ్యతిరేకించే బీజేపీతో జతకట్టి , రైతు పక్షపాతిగా ఉంటామని హామీలు ఇచ్చి నేడు నిర్లక్ష్యం చేయడం సర్కార్‌కు న్యాయమా అంటూ ప్రశ్నించారు. రైతులకు అవసరమైన జేజీఎల్ 384 రకం విత్తనాలను పంపిణీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

