YS Sharmila | 21న ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న వైఎస్ షర్మిల
YS Sharmila | ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల (YS Sharmila) ఈనెల 21న బాధ్యతలు స్వీకరించనున్నారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల (YS Sharmila) ఈనెల 21న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాణిక్కం ఠాకూర్(Manikkam Tagore), మయప్పన్‌తో పాటు ఏపీకి చెందిన సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఏపీ(Andhra Pradesh)లో త్వరలో ఎన్నికలు జరుగనున్న సమయంలో షర్మిలకు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది.
ఉమ్మడి రాష్ట్రం వీడిపోయిన తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలయ్యింది. విభజన వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేయలేదు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ(TDP) 102 సీట్లతో అధికారంలోకి రాగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. నాటి ఎన్నికల్లో వైసీపీ(YCP) కి 70 సీట్లు వచ్చాయి.
2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లకు గాను 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది . తెలుగుదేశానికి 23 సీట్లు రాగా జనసేన ఒక స్థానం నుంచి గెలుపొందింది. ఈసారి అధికారంలో ఉన్న వైఎస్ జగన్‌ను ఓడించాలనే లక్ష్యంతో జగన్(YS Jagan) సోదరి వైఎస్ షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించింది. తెలంగాణ వైఎస్సార్ పార్టీని స్థాపించి తెలంగాణలో ప్రచారం చేసుకున్న షర్మిల ఏ ఎన్నికల్లో పోటి చేయకుండానే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసిన 15 రోజుల్లో ఏపీకి చీఫ్‌గా నియమించడం రాజకీయంగా సంచలనం కలిగించింది .
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

