YS Sharmila | చేతకాని తనానికి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా..? : వైఎస్ షర్మిల
YS Sharmila | ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను మరో రెండేళ్లు కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే.. ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమిట్లా..? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా..? ఐదేళ్లు అధికారి ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదన్నారు.
YS Sharmila | ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను మరో రెండేళ్లు కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే.. ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమిట్లా..? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా..? ఐదేళ్లు అధికారి ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదన్నారు. రాష్ట్రానికి రాజధాని లేదని, ప్రత్యేక హోదా రాలేదన్నారు.
ప్రత్యేక ప్యాకేజీలు లేవని.. పోలవరం పూర్తి కాలేదన్నారు. కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కులేదేలని ఆరోపించారు. కొత్త పరిశ్రమలు లేవని.. ఉన్నవి ఉంటాయో లేదో తెలియదంటూ విమర్శలు గుప్పించారు. రూ. 8లక్షల కోట్ల అప్పులు చేసి ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా చేశారే తప్పా.. అభివృద్ధి చేయలేదంటూ ఆరోపించారు. మోదీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ,, విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదన్నారు. ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి ఉందన్నారు.
చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3డీ గ్రాఫిక్స్ అయితే.. మూడు రాజధానుల పేరుతో జగనన్న ఆడింది మూడు ముక్కలాట అంటూ ఎద్దేవా చేశారు. పూటకో మాట, రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను.. కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశమని విమర్శించారు.
ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్పా.. వైసీపీకి రాజధానిపై, రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

