YS Jagan | కెప్టెన్ స్మిట్ మచ్చార్ ధైర్యసాహసాలకు సెల్యూట్ : వైఎస్ జగన్
YS Jagan | ఫ్లైదుబాయ్ విమాన కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై(Pilot Smit Machchhar )మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) ప్రశంసలు కురిపించారు.
YS Jagan | ఫ్లైదుబాయ్ విమాన కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై(Pilot Smit Machchhar )మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) ప్రశంసలు కురిపించారు. ఫ్లైదుబాయ్ విమాన ఘటన విషయమై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో గగనతలంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ, ప్రయాణికులను కాపాడటంలో చూపిన ధైర్యానికి ఆయన అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రాణాలకు తెగించి ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా మచ్చార్ ధైర్యంగా నిలిచారని జగన్ తెలిపారు. ఆయన ధైర్యం, త్యాగం, నిస్వార్థ సేవ ప్రశంసనీయమన్నారు. స్మిట్ మచ్చార్ దేశం గర్వించదగ్గ నిజమైన హీరో అని కొనియాడారు. అలాగే, కెప్టెన్ స్మిట్ మచ్చార్ త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
అలాగే మచ్చర్ ధైర్య సాహాసాలను పీఎం మోదీ ప్రశంసించారు. మచ్చర్ శౌర్యం వందలాది ప్రాణాలను కాపాడటానికి, ఒక పెద్ద విషాదాన్ని నివారించడానికి సహాయపడిందన్నారు. అతని శౌర్యం వందలాది ప్రాణాలను కాపాడటానికి, ఒక పెద్ద విషాదాన్ని నివారించడానికి సహాయపడిందని కెప్టెన్ మచ్చర్ పట్ల భారత్ గర్విస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని, తిరిగి పూర్తి శక్తిని, ఆరోగ్యాన్ని పొందాలని ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

